Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'గాయం నుండి నీరజ్ చోప్రా కోలుకుంటున్నాడు'

Neeraj Chopra recovering without complications says AFI president

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మోచేతి గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నాడు అని భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు అదిల్లే సుమరివాలా తెలిపారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు సాధన చేస్తున్న క్రమంలోనీరజ్ చోప్రా కుడి మోచేతికి గాయం అయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే ముంబైలోని ప్రముఖ కోకిలాబేన్ ఆసుపత్రిలో నీరజ్ చోప్రాకు శస్త్రచికిత్స జరిగింది. గురువారం నీరజ్ కోలుకుంటున్నాడని అదిల్లే సుమరివాలా తెలిపారు. 'ప్రస్తుతం అతడికి ఫిజియో తెరపీ జరుగుతోంది. ఇప్పటికే నాలుగు సెషన్లు పూర్తయ్యాయి. నీరజ్ గాయం గురించి డాక్టర్లతో మాట్లాడుతా. ప్రస్తుతం అతను అన్ని పనులు చేస్తున్నాడు. అతని రిపోర్టులు అన్ని బాగున్నాయి' అని అదిల్లే తెలిపారు.

'వరల్డ్ చాంపియన్‌షిప్ గురించి అతనితో ఇప్పుడే చర్చించడం లేదు. దాని గురించి ఆలోచిస్తే.. నీరజ్ మరింత బలంగా విసిరేందుకు యత్నిస్తాడు. మొదటగా అతను కోలుకోవడంపై దృష్టిపెట్టాం' అని అదిల్లే పేర్కొన్నారు. నీరజ్ గతేడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు నెగ్గిన విషయం తెలిసిందే. గాయం కారణంగా నీరజ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు.

Story first published: Friday, May 17, 2019, 16:15 [IST]
Other articles published on May 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+