న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్సీ బాధ్యతలను కొనసాగించాలా? వద్దా?: సందిగ్ధంలో మోర్గాన్

Need time to think about future as England captain: Eoin Morgan

హైదరాబాద్: వెన్నునొప్పి నుంచి ఎలా కోలుకుంటాననే దానిపైనే ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా తన భవిష్యత్తు ఉంటుందని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ఈ మధ్య కాలంలో ఇయాన్ మోర్గాన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్‌గా తప్పుకునే అవకాశముందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎలా సెలక్ట్ అయ్యాడో తెలుసా?: కపిల్ దేవ్ వెల్లడి

ఈ నేపథ్యంలో శుక్రవారం ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ తనపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని, అయితే కెప్టెన్సీ బాధ్యతలను కొనసాగించాలా? వద్దా? అనే విషయాలపై ఆలోచించాల్సి ఉందని చెప్పాడు. మోర్గాన్ మాట్లాడుతూ "ఇది పెద్ద నిర్ణయం, పెద్ద నిబద్ధత. ప్రపంచ కప్‌లో నేను ఎదుర్కొన్న గాయం కారణంగా, నేను పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి సమయం కావాలి" అని అన్నాడు.

"ఇది శారీరక శ్రమ. నేను పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి కాస్త సమయం పడుతుంది. ఇంగ్లాండ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం పెద్ద బాధ్యత. నాకు తప్పుకోవాలని ఉన్నా.. అది చాలా పెద్ద నిర్ణయం. ప్రస్తుతం ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటానికి ప్రయత్నిస్తున్నా. ఆ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది" అని మోర్గాన్ చెప్పుకొచ్చాడు.

యాషెస్: భారీ స్కోరు సాధించడంలో వార్నర్ విఫలం

"ప్రపంచకప్‌ సమయంలో నేను పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయలేకపోయా. ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ముందుండి నడిపించాలి. అదే మనల్ని ముందుకు తీసుకెళుతుంది" అని ఇయాన్ మోర్గాన్‌ తెలిపాడు. వరల్డ్ కప్ అనంతరం రెండు వారాల విశ్రాంతి తర్వాత మోర్గాన్ ప్రస్తుతం టీ20 బ్లాస్ట్ టోర్నీలో మిడిలెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

కాగా, ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Saturday, August 17, 2019, 11:34 [IST]
Other articles published on Aug 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X