Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌ని కిడ్నాప్ చేయాలి: బ్రిటన్ మాజీ ప్రధాని సంచలనం

హైదరాబాద్: బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌పై శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత పర్యటనలో కష్టకాలంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు ట్రైనింగ్ ఇచ్చేందుకు గాను సచిన్‌ను కిడ్నాప్ చేయాలని ఆయన జోక్ వేశారు.

హిందూస్ధాన్ టైమ్స్ లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు డేవిడ్ కామెరూన్ భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తాను భారత్‌కు వచ్చిన ప్రతిసారీ దేశ పురోగతి, సామర్థ్యాన్ని చూసి ఎంతో ముగ్ధుణ్నవుతున్నానని చెప్పడంతో సభలో చప్పట్లు మారుమ్రోగాయి.

ఇరుదేశాల మధ్య చరిత్ర, సంస్కృతి భాగస్వామ్యంతోపాటు ఉద్యోగాలు, పెట్టుబడులు ఆధారంగా "ఆధునిక భాగస్వామ్యం" పట్ల తనకు మక్కువ ఎక్కువగా ఉందని అన్నారు. ఇక ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరిస్‌పై కూడా కామెరూన్ స్పందించారు.

Need to kidnap Sachin Tendulkar to train England cricket team, says David Cameron

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సిరిస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. టెస్టు సిరిస్‌లో ఇంగ్లాండ్ జట్టు వెనుకబడి ఉండటంతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ని కిడ్నాప్ చేసి ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ట్రైనింగ్ ఇప్పించాలని చమత్కరించాడు.

ఇదిలా ఉంటే సచిన్ టెండూల్కర్ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దీంతో పాటు ఈ సమావేశంలో కామెరూన్ తన జీవితంలో అనుభవాలను షేర్ చేసుకున్నాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ఎప్పుడు కూడా గోల్ఫ్ ఆడకూడదు (ఎందుకంటే మనం విజయం సాధించలేం) అని అన్నారు.

ఇక వివాదాస్పద మాజీ ఇటాలియన్ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీతో కలిసి పార్టీకి వెళ్లకూడదని, అదే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి ఫ్లాట్ ఫాంను షేర్ చేసుకోకూడదు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+