
ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు:
యువ పేసర్ శివమ్ మావీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా వీరవిహారం చేశాడు. ఓవర్లో ఆరు ఫోర్లు (Wd, 4, 4, 4, 4, 4, 4) కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో భారత సీనియర్ బ్యాట్స్‌మన్, ప్రస్తుతం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అజింక్య రహానే తర్వాత ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టిన రెండో క్రికెటర్ షానే కావడం విశేషం. 2012లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన రహానే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఈ ఫీట్ సాధించాడు. గత రాత్రి షా ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు బాదాడు.

ఐదు అవార్డులు:
కోల్‌కతా మ్యాచ్‌లో పృథ్వీ షా ఏకంగా ఐదు అవార్డులు గెలుచుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు, సఫారీ సూపర్ స్టైకర్ (200 స్టైక్‌రేట్) అవార్డు, గేమ్ ఛేంజర్ అవార్డు (117 ఫాంటసీ పాయింట్లు), క్రెడ్ పవర్ ప్లేయర్ అవార్డు (పవర్ ప్లేలో 48 నాటౌట్ 16 బంతుల్లో), అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ అసెట్ అవార్డు (అప్‌స్టాక్స్ క్రిక్‌ఇన్‌డెక్స్ 38 పాయింట్లతో)లు షా గెలుచుకున్నాడు. దీంతో షాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో షా రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్, బాలీవుడ్ హీరోయిన్ ప్రాచి సింగ్ కూడా అభినందనలు తెలిపారు.

సూట్ కేసు కావాలేమో:
పృథ్వీ షాను విష్ చేస్తూ.. 'నిన్ను చూస్తే గర్వంగా ఉంది' అని ప్రాచి సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చారు. అయితే ఐదు అవార్డులు తీసుకోవడంపై ఓ సెటైర్ వేశారు. షా అందుకున్న అవార్డులన్నింటినీ కలిపి ఒక ఫోటోలో జత చేసిన ప్రాచి.. 'ఆ అవార్డులు అన్ని తీసుకెళ్లడానికి కొత్త సూట్ కేసు కావాలేమో' అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. గత కొంతకాలంగా ప్రాచి సింగ్‌తో షా ప్రేమాయణం నడుపుతున్నాడనే వార్తలు షికార్లు చేశాయి. అయితే వీటిపై ఇద్దరి నుంచి క్లారిటీ లేదు. కానీ పృథ్వీ షా ప్రదర్శనపై తాజాగా ప్రాచి స్పందించడంతో వారి మధ్య ఏదో ఉందనే గుసగుసలు మళ్లీ వినిపిస్తున్నాయి.

షా మెడను గట్టిగా పట్టుకుని:
మ్యాచ్ తర్వాత తన ఓవర్‌లో వీరబాదుడు బాదిన పృథ్వి షాపై ప్రతీకారం తీర్చుకున్నాడు శివమ్ మావి. సీరియస్‌గా కాదు గానీ.. నా ఓవర్‌లోనే ఆరు ఫోర్లు కొడతావా అంటూ పృథ్వి మెడను గట్టిగా పట్టుకున్నాడు. ఈ వీడియోను ఐపీఎల్ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. 'మ్యాచ్ ముగియగానే ఫ్రెండ్స్ అయిపోయారు' అంటూ ఐపీఎల్ పోస్ట్ చేయడం విశేషం. మావి, షా ఇద్దరూ అండర్-19 జట్టులో మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












