అందుకు ధోనియే కారణం: కోహ్లీతో కెమిస్ట్రీపై నయన్ మోంగియా
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ క్రికెటర్ నయన్ మోంగియా ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు అటు వన్డేలు, ఇటు టెస్టుల్లో నెంబర్ వన్‌గా నిలవడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని అన్నాడు. అందుకు ధోనియే కారణమని పేర్కొన్నాడు.
ఇక, ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న కోహ్లీ తనదైన శైలిలో రాణిస్తున్నాడని కొనియాడాడు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బ్రహ్మాండంగా కుదిరిందని చెప్పుకొచ్చాడు. ధోనీ నుంచి సలహాలు, సూచనలు అందుకుంటూ కోహ్లీ మరింతగా రాటుదేలుతున్నాడని ప్రశంసించాడు.

ధోని సలహాలతోనే ఆసీస్‌పై కోహ్లీసేన సిరిస్ నెగ్గింది
ధోని సలహాలతోనే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 4-1తో భారత్ నెగ్గిందని మోంగియా చెప్పాడు. టెస్టుల్లో భారత్‌కు ఉన్నతస్థానంలో నిలిపిన తర్వాతే ధోని రిటైరయ్యాడని తెలిపాడు. ధోని సేవలు జట్టుకు ఎంతో అవసరమని, ధోని గొప్ప ఫినిషరే కాకుండా మ్యాచ్ విన్నర్ కూడా అని కితాబిచ్చాడు.

ధోని అత్యుత్తమ ఫినిషరే కాదు మ్యాచ్ విన్నర్ కూడా
'ధోని అత్యుత్తమ ఫినిషర్ మాత్రమే కాదు. సీనియర్ బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా, మాజీ కెప్టెన్‌గా జట్టు విజయాలలో ధోని తన వంతు పాత్రను పోషిస్తున్నాడు. ధోని ప్రభావం వల్లనే వన్డేల్లోనూ జట్టు అద్భుత విజయాలు సాధిస్తూ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. 2019 వన్డే ప్రపంచ కప్ జట్టులో ధోని సభ్యుడిగా ఉంటాడు. అతడి సేవలు జట్టుకు సత్ఫలితాన్నిస్తాయి' అని మోంగియా అన్నాడు.

ఆ సామర్థ్యం కేవలం ధోనికి మాత్రమే ఉంది
జట్టులో అందరికంటే ఎక్కువగా ఆటను, మ్యాచ్ పరిస్థితిని అంచనా వేసే సామర్థ్యం కేవలం ధోనికి మాత్రమే ఉందని పేర్కొన్నాడు. ధోని ఆటకు, వయసుకు సంబంధం లేదని, ధోని విషయంలో వయసు ఒక అంకె మాత్రమేనని పేర్కొన్నాడు. 2019 ప్రపంచకప్ జట్టులో ధోని తప్పకుండా ఉంటాడని, ఇందులో ఎవరికీ సందేహం అవసరం లేదని పేర్కొన్నాడు.

ధోని జట్టులో ఉండడం వల్ల కోహ్లీకే లాభం
ధోని జట్టులో ఉండడం వల్ల కోహ్లీకే లాభమని పేర్కొన్న మోంగియా ధోని ఫిట్‌నెస్‌ను, ఫామ్‌ను కొనసాగిస్తే అతడికి కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ధోని విలువ వారికి తెలుసు కాబట్టే అండగా నిలిచారని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications