సచిన్ ఒకేసారి స్టంపౌట్: ఆ పాపం నాదేనన్న సెహ్వాగ్
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన టెస్టు కెరీర్‌లో ఒకేసారి స్టంపౌట్ అయ్యాడని, దానికి పరోక్షంగా తానే కారణమని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఢిల్లీలో సెహ్వాగ్ నెలకొల్పిన క్రికెట్ స్కూలు వార్షికోత్సవానికి రెండు రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ హాజరైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సెహ్వాగ్ మాట్లాడాడు. 2001లో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆష్లే గైల్స్ అదే పనిగా నెగెటివ్ బౌలింగ్ వేసి.. సచిన్‌ను అసహనానికి గురి చేసి స్టంపౌట్ అయ్యేలా చేశాడు. అయితే సచిన్ ఆ రోజు స్టంపౌట్ కావడంలో ప్రధాన పాత్ర తనదే అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు.

టెస్టుల్లో సచిన్ ఒకేసారి స్టంపౌట్
‘గైల్స్ లెగ్ సైడ్ వికెట్‌కు దూరంగా బంతులేస్తున్నాడు. నేను సులువుగా షాట్లు ఆడుతూ ఉంటే.. సచిన్ ఎక్కువ ప్యాడ్లు అడ్డం పెడుతున్నాడు. అప్పుడు సచిన్ దగ్గరికెళ్లి బంతి పెద్దగా స్పిన్ కావడం లేదని, ముందుకొచ్చి షాట్లు ఆడమని చెప్పాను. అయితే అనుకోకుండా సచిన్ ముందుకొచ్చి ఆడిన బంతి ఒక్కటి మాత్రమే స్పిన్ అయింది. ఆ బంతికే సచిన్ స్టంపౌట్ అయ్యాడు. ఆట అయ్యాక నేను డ్రెస్సింగ్ రూంకే వెళ్లలేదు. అంపైర్ల గదిలోనే ఉండిపోయా. తర్వాత నాకు సచిన్ నుంచి పిలుపొచ్చింది. టెస్టుల్లో తొలిసారి స్టంపౌట్ అయ్యానని, అందుకు కారణం నేనే' అని అన్నాడు.

సచిన్ చేతుల మీదగా క్రికెట్ స్కూలు ప్రారంభం
ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత తాను నెలకొల్పిన క్రికెట్ స్కూలుని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మీదుగా ప్రారంభించాలని అనుకుని.. ఆ ఆలోచనను ఎందుకు విరమించుకున్న విషయాన్ని కూడా వీరూ వెల్లడించాడు.

సచిన్‌కు షరతు పెట్టాను
‘‘2010లో శ్రీలంకపై ట్రిపుల్ సెంచరీకి చేరువగా వచ్చాను. నేను ఆ మ్యాచ్‌లో ట్రిపుల్ సాధిస్తే నా క్రికెట్ స్కూలు ప్రారంభోత్సవానికి రావాలని సచిన్‌కు షరతు పెట్టాను. కానీ ఆ మ్యాచ్‌లో నేను 293కే అవుటయ్యాను'' అందుకే అప్పడు సచిన్‌ను పిలవలేదని సెహ్వాగ్ వెల్లడించాడు.

తనకు తానే పెద్ద వీరాభిమానిని
తాను చాలా మంది క్రికెటర్లను ఆరాధిస్తానని, అందులో తనకు తానే పెద్ద వీరాభిమానినని చెప్పాడు. ‘‘నా ఆటకు సంబంధించిన వీడియోలు చూసి ఆస్వాదిస్తుంటా. నేను చాలామంది క్రికెటర్లను ఆరాధిస్తాను. వారిలో నేనూ ఒకడిని. నాకు నేనే అభిమానిని'' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications