For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే సిరాజ్‌ను జట్టు నుంచి తప్పిస్తున్నాం: బీసీసీఐ

దులీప్ ట్రోఫీకి ఎంపికైన స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను 'ఇండియా-బీ' జట్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో 'బీ' జట్టులో నవదీప్ సైనీ చేరనున్నాడని తెలిపింది. అనారోగ్యానికి గురైన సిరాజ్.. దులీప్ ట్రోఫీ ప్రారంభ సమయానికి కోలుకుంటాడని భావించట్లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

మహ్మద్ సిరాజ్‌తో పాటు అనారోగ్యానికి గురైన మరో యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా దులీప్ ట్రోఫీకి అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ తెలిపింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో 'ఇండియా-సీ ' జట్టులో గౌరవ్ యాదవ్ ఎంపికయ్యాడని చెప్పింది. ఇక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను కూడా ఇండియా-బీ నుంచి విడుదుల చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే జడేజా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి వివరాలు చెప్పలేదు.

Navdeep Saini Replaces Mohammad Siraj in Team B for Duleep Trophy BCCI

ఇండియా బీలో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డి ఈ టోర్నీలో పాల్గొనడం ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉందని బీసీసీఐ తెలిపింది. సెప్టెంబరు 5 నుంచి దులీప్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నవిషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతరపురం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, మొదటి రౌండ్‌కు ఎంపిక చేసిన నాలుగు జట్ల వివరాలు....

ఇండియా ఏ: శుభ‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబె, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావెరప్ప , కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్.

ఇండియా బీ: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ , జగదీషన్.

ఇండియా సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్.

ఇండియా డీ: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ, యశ్ దూబె, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ సేన్‌గుప్తా, కేస్ భరత్, సౌరభ్ కుమార్.

Story first published: Tuesday, August 27, 2024, 14:31 [IST]
Other articles published on Aug 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+