Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నవదీప్ షైనీ: ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టులో కీలక బౌలర్‌గా!

Navdeep Saini could end up playing World Cup, says RCB bowling coach Ashish Nehra

హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌ ద్వారా వెలుగులోకి వచ్చిన బౌలర్ నవదీప్ షైనీ. గత ఐపీఎల్ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం నవదీప్ షైనీని రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయిన అతడు ఈ సీజన్‌లో మాత్రం ఆర్సీబీ జట్టులో కీలక బౌలర్‌గా మారాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

నెట్స్‌ బౌలర్లలో ఒకడిగా నవదీప్ షైనీ

నెట్స్‌ బౌలర్లలో ఒకడిగా నవదీప్ షైనీ

ఈ సీజన్‌లో అతడి బౌలింగ్ స్కిల్స్‌ను చూసిన టీమిండియా సెలక్టర్లు వరల్డ్‌కప్‌లో భారత క్రికెట్ జట్టుకు నెట్స్‌ బౌలర్లలో నవదీప్ షైనీని ఒకడిగా ఎంపిక చేశారు. మొత్తం ముగ్గురు బౌలర్లను ఎంపిక చేయగా అందులో నవదీప్ షైనీ ఒకడు. ఈ నేపథ్యంలో షైనీపై బెంగళూరు బౌలింగ్‌ కోచ్‌ ఆశిష్ నెహ్రా ప్రశంసల వర్షం కురిపించాడు.

కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే

కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే

"కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే అతడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. అతడు రాణిస్తాడని ఎవరూ ఊహించలేదు. అదే ఐపీఎల్ బ్యూటీ. షైనీ మంచి వేగంతో బంతులు వేస్తున్నాడు. పరుగులు కొంచెం ఎక్కువగా ఇస్తున్నప్పటికీ ఒక మంచి బౌలర్‌ అయ్యేందుకు కావాల్సిన లక్షణాలన్నీ సైనీకి ఉన్నాయి" అని నెహ్రా అన్నాడు.

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో

గంటకు 150 కిలోమీటర్ల వేగంతో

"గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ వేయగల బౌలర్‌గా టీమిండియాకు ఉపయోగపడతాడు. చూడండి... ఈరోజు అతడు ఎక్కడ ఉన్నాడో. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న బౌలర్లలో ఒకవేళ ఎవరైనా గాయపడితే జట్టుకు అందుబాటులో మొదటి వరుసలో ఉండేది షైనీనే" అని నెహ్రా అన్నాడు. మరోవైపు నవదీప్ షైనీ బౌలింగ్‌పై ఆస్ట్రేలియా మాజీ బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ సైతం ప్రశంసలు కురిపించాడు.

బ్రెట్ లీ సైతం ప్రశంసలు

బ్రెట్ లీ సైతం ప్రశంసలు

తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో బ్రెట్ లీ మాట్లాడుతూ "ఐపీఎల్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతున్నాడు. మరో బౌలరే నవ్‌దీప్‌ షైనీ కూడా చక్కగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం భారత్‌లో మంచి పేసర్లు ఉన్నారు" అని బ్రెట్‌ లీ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం ఆర్సీబీ ఈడెన్ గార్డెన్ వేదికగా కేకేఆర్‌తో తలపడనుంది.

Story first published: Friday, April 19, 2019, 15:52 [IST]
Other articles published on Apr 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+