Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డ్రెస్సింగ్ రూమ్‌లోకి సెలక్టర్: రంగంలోకి బీసీసీఐ అవినీతి నిరోధక అధికారి!

National selector Devang Gandhi removed from Bengal dressing room after Manoj Tiwary complaint


హైదరాబాద్: రంజీ ట్రోఫీలో భాగంగా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఆటగాళ్ల డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి బీసీసీఐ జాతీయ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ వెళ్లడం కొత్త వివాదానికి దారి తీసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్-ఆంధ్ర జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో బెంగాల్‌ క్రికెటర్ల డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి దేవాంగ్‌ గాంధీ వెళ్లి నిబంధనలను అతిక్రమించాడు.

ప్రస్తుతం దేవాంగ్ గాంధీ ఈస్ట్ జోన్ నుండి జాతీయ సెలెక్టర్‌గా కొనసాగుతున్నారు. రెండో రోజైన గురువారం ఆటలో భాగంగా దేవాంగ్ గాంధీ బెంగాల్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లాడు. దీనిపై బెంగాల్ జట్టులోని సీనియర్ ఆటగాడు మనోజ్ తివారీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. సెలక్టర్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎలా వస్తాడంటూ నిలదీశాడు.

దీనిపై బెంగాల్ ఆటగాళ్లు ఫిర్యాదు చేయడంతో దేవాంగ్‌ గాంధీని డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి బీసీసీఐ అవినీతి నిరోధక అధికారి సౌమెన్ కర్మకర్ బయటకు పంపించే వేశారు. అవినీతి నిరోధక ప్రోటోకాల్ గురించి బెంగాల్ సీనియర్ ఆటగాళ్ళు ప్రశ్న లేవనెత్తడంతో వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్ళు, జట్టు సహాయక సిబ్బంది మాత్రమే డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండాలి.

ఈ వివాదంపై మనోజ్ తివారీ మాట్లాడుతూ "మేము అవినీతి నిరోధక కోడ్‌ను ఫాలో కావాలి. ఒక జాతీయ సెలక్టర్‌ అయిన దేవాంగ్‌ గాంధీ ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రాకూడదు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లతో పాటు జట్టుకు సంబంధించిన వారు మాత్రమే ఉండాలి. దేవాంగ్‌ ఎందుకు అతిక్రమించాడు" అని రిపోర్టర్లతో తెలిపాడు.

ఇదిలా ఉంటే, తొలి రోజు ఆటలో భాగంగా ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగాల్‌ 281/7 వద్ద ఉండగా మ్యాచ్‌కు బ్యాడ్‌లైట్‌ అంతరాయం కలిగించింది. రెండో రోజైన గురువారం బెంగాల్‌ 289 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో బెంగాల్‌ ఆటగాడు అభిషేక్‌ రామన్‌(112) సెంచరీ సాధించాడు.

Story first published: Thursday, December 26, 2019, 16:41 [IST]
Other articles published on Dec 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+