For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భార్య ఆత్మహత్య కేసులో జాతీయ కబడ్డీ ఆటగాడు అరెస్ట్

By Nageshwara Rao

న్యూఢిల్లీ: వరకట్న వేధింపులతో భార్య లలిత ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో జాతీయ కబడ్డీ ఛాంపియన్ రోహిత్ చిల్లర్‌ను ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రో కబడ్డీ లీగ్‌లో మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న రోహిత్ భార్య మంగళవారం ఢిల్లీలోని తన తండ్రి నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌తో పాటు, రెండు గంటల పాటు రికార్డు చేసిన ఆడియో మెసేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో లలిత 'ఇంకా ఇలా బతికేంత శక్తి నాకు లేదు. చనిపోవాలని నిర్ణయించుకున్నా' అని రాసింది.

దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ రోహిత్‌తో అతని తల్లిదండ్రులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని ముంబైలోని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ కేసులో లొంగిపోయిన రోహిత్ తండ్రి విజయ్ సింగ్‌ను ఢిల్లీలోని కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.

National Kabbadi Player Rohit Chillar Arrested Over Wife's Suicide

కాగా, సోమవారం సాయంత్రం పశ్చిమ ఢిల్లీలోని అశోక్‌ మొహల్లా నంగ్లోయ్‌ ప్రాంతంలోని తన తండ్రి నివాసంలో ఉరేసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆరు నెలల క్రితం వీరి వివాహం జరిగింది. అయితే ఆమె ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. ఆత్మహత్యకు ముందు తన భర్త కోసం రెండు గంటల ఆడియో మెసేజిని, కుటుంబం కోసం ఓ చిన్న మెసేజిని ఆమె రికార్డు చేసింది. రోహిత్ వేరొక మహిళతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడని ఆమె అందులో పేర్కొన్నారు.

ఆడియో మేసేజ్‌లో తన భర్త, అతడి కుటుంబసభ్యులు వరకట్నం కోసం వేధిస్తున్నారని, తనను తీవ్రంగా అవమానపరిచారని, ఇంటి నుంచి గెంటివేసినట్లు ఆమె రాశారు. సూసైడ్ నోట్ ఆధారంగా రోహిత్‌తో పాటు, అతని తల్లిదండ్రులపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు.

రోహిత్‌ తాను సంతోషంగా ఉండాలంటే ఒంటరిగా వదిలేయమని కోరాడని లలిత వీడియోలో పేర్కొందని, దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన లలిత ఈ నిర్ణయం తీసుకుందని పోలీసులు తెలిపారు. రోహిత్ చిల్లర్‌తో పెళ్లి ఆమెకు రెండో పెళ్లి కావడం విశేషం. లలిత చాలా డిప్రెషన్‌కు గురైందని, మొదటి పెళ్లిలో కూడా ఆమె వరకట్న వేధింపులు ఎదుర్కొందని ఆమె తరుపు బంధువులు తెలిపారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+