న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాథన్ లియోన్‌కు మళ్లీ పెళ్లి.. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎమ్మాతో రింగులు మార్చుకున్న స్పిన్ మాంత్రికుడు

nathan lyon

ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ ఆదివారం తన ఫియాన్సి ఎమ్మా మెక్‌కార్తీని పెళ్లాడాడు. వీరిద్దరూ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితుల సమక్షంలో రింగులు మార్చుకుని ఒక్కటయ్యారు. 34ఏళ్ల నాథన్ లియోన్ తన బెటర్ హాఫ్‌ అయిన ఎమ్మా చేతులు పట్టుకుని దిగిన ఫోటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. పూసల పెళ్లి గౌనులో ఎమ్మా దేవతలా ఉండగా.. లియోన్ నల్లటి సూట్ ధరించి టిప్ టాప్‌గా రెడీ అయ్యాడు.

లియోన్ ఈ ఫోటోకు "Mr & Mrs" అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక లియోన్ నవ దంపతులకు జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, పీటర్ సిడిల్, అలెక్స్ కారీ, క్రిస్ గ్రీన్, మిచెల్ స్వెప్సన్, మాట్ రెన్‌షాలతో సహా అనేక మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక లియోన్, ఎమ్మా దంపతులు నిశ్చితార్తం 2021లోనే జరిగింది. కానీ పెళ్లికి వీరిరువురు కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఇక లియో‌న్‌కు ఇది రెండో వివాహం. లియోన్ తన మాజీ భార్య మెల్ వారింగ్ నుండి 2017లో విడిపోయాడు. ఆ తర్వాత ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏజెంట్ అయిన ఎమ్మాతో అతనికి సంబంధం ఏర్పడి అది వివాహబంధానికి దారి తీసింది.

ఇటీవల శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో లియాన్ మంచి ప్రదర్శన చేశాడు. స్పిన్-బౌలింగ్‌కు పెద్ద ఎత్తున అనుకూలించే పరిస్థితుల్లో.. లియాన్ మూడు ఇన్నింగ్స్‌లలో 11వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఓపెనింగ్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయానికి బాటలు వేశాడు. టెస్టు క్రికెట్‌లో ఆల్ టైమ్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో లియాన్ ప్రస్తుతం 10వ స్థానంలో ఉన్నాడు. నాథన్ లియోన్ ఇప్పటివరకు 110టెస్టులు ఆడగా.. 20 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించాడు. అతని ఖాతాలో 438వికెట్లున్నాయి. ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్ తర్వాత మూడో బౌలర్‌గా అతను కొనసాగుతున్నాడు.

Story first published: Monday, July 25, 2022, 9:05 [IST]
Other articles published on Jul 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X