ఖాళీ స్టేడియాల్లో విరాట్ కోహ్లీ ఎలా ఆడతాడో?: లైయన్

సిడ్నీ: మైదానంలో ఎప్పుడూ దూకుడుగా ఉండే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేక్షకులు లేకుండా నిర్వహించే మ్యాచ్‌లలో చూడటం భిన్నంగా ఉంటుందని ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లైయన్ అన్నాడు. ఈ ఏడాది డిసెంబరులో నాలుగు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో ఒకవేళ ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వ హించాల్సిన పరిస్థితి రావొచ్చు. ఖాళీ స్టేడియాల్లో భారత్-ఆసీస్ మధ్య టెస్టు సిరీస్ నిర్వహిస్తే.. ఎలా ఉంటుందని ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో కలిసి లైయన్ చర్చించాడు.

కోహ్లీ ఎలా ఉంటాడో:
'కరోనా వైరస్ కారణంగా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగితే ఎలా ఉంటుందని మిచెల్ స్టార్క్, నేనూ మాట్లాడుకున్నాం. ఒకవేళ అదే నిజమైతే విరాట్ కోహ్లీ ఆటతీరు ఎలా ఉంటుందో అని చర్చించాం. ఎందుకంటే.. ఏ దేశంలో ఆడినా ప్రేక్షకుల మద్దతుతో భారత కెప్టెన్ ఆట మరో స్థాయికి చేరుతుంది. కోహ్లీ సూపర్ స్టార్ కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకోగలడు. ఏదేమైనా ప్రేక్షకులు లేకుండా కోహ్లీని చూడటం అద్భుతంగా ఉంటుంది' అని నాథన్ లైయన్ పేర్కొన్నాడు.

భారత్ పవర్‌హౌస్ వంటిది:
'క్రికెట్ ప్రపంచంలో భారత్ పవర్‌హౌస్ వంటిది. టీమిండియాతో సిరీస్ అంటే మరో యాషెస్ లాంటిదే. స్వదేశంలో టెస్టు సిరీస్ పోరు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. గత పర్యటనలో మా జట్టుని కోహ్లీసేన ఓడించింది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు జట్టు పటిష్ఠంగా ఉంది, కీలక ఆటగాళ్లు జట్టులో ఉన్నారు' అని నాథన్ లైయన్ అన్నాడు. 2018లో ఆస్ట్రేలియా క్రికెట్‌ను బాల్ ట్యాంపరింగ్ కుదిపేసిన విషయం తెల్సిందే. ఈ వివాదంతో స్టివ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఒక ఏడాది నిషేధం ఎదుర్కొన్నారు.

వైద్యాధికారులు సూచిస్తే పాటిస్తాం:
'కరోనా వైరస్ కారణంగా స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని వైద్యాధికారులు సూచిస్తే పాటిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్‌ల నిర్వహణపై ఆటంకాలు కలుగుతుండటంతో.. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ షెడ్యూల్‌పై సందేహాలు మొదలయ్యాయి. ఫైనల్‌లో ఆసీస్ జట్టు ఉండాలని కోరుకుంటున్నా. వాయిదాపై నిర్ణయాలు ఐసీసీ పెద్దలు తీసుకుంటారు' అని లైయన్ వెల్లడించాడు.

వివాదం మా జీవితాంతం వెంటాడుతుంది:
'బాల్ ట్యాంపరింగ్ వివాదం మా జీవితాంతం వెంటాడుతుంది. అలాంటి కష్టకాలంలో ఉన్న జట్టును తన నాయకత్వ ప్రతిభతో మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు టిమ్ పైన్ ప్రయత్నించాడు. కెప్టెన్‌గా పైన్ తన విశ్వసనీయతను కాపాడుకుంటునే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అతని నిజాయితే పైన్‌ను ఏదో ఒకరోజు ఉత్తమ కెప్టెన్‌గా నిలబెడుతుంది. రోజురోజుకు కెప్టెన్సీలో పైన్ మరింత రాటు దేలుతున్నాడు' అంటూ ఆసీస్ స్పిన్నర్ ప్రశంసలు కురిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications