బెంగుళూరు టెస్టు: మ్యాజిక్ చేసి 8 వికెట్లు తీసిన లియాన్
హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 189 పరుగులకే ఆలౌటైంది. పూణె టెస్టులో భారత బ్యాటింగ్ లైనప్‌ను ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ కూల్చితే, బెంగుళూరు టెస్టులో స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ కుప్పకూల్చాడు.
పూణె టెస్టు మాదిరే మరోసారి ఆస్ట్రేలియా స్పిన్ ఉచ్చులో కోహ్లీ సేన పడింది. అయితే ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ఫీట్ సాధించలేకపోయిన లియాన్, ఒకే టెస్టులో పది వికెట్ల ఫీట్ సాధించేందుకు సిద్దంగా ఉన్నాడు. అంతేకాదు బెంగుళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి అరుదైన రికార్డు సాధించాడు.
ఉపఖండంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు
భారత ఉపఖండంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అంతే కాకుండా బెంగళూరు చిన్నసామి స్టేడియంలో ఇంతవరకు ఏ విదేశీ బౌలర్ సాధించని గణాంకాలు నమోదు చేశాడు. దీంతో ఈ పిచ్‌పై అత్యధిక వికెట్లు తీసిన తొలి విదేశీ ఆటగాడిగా లియాన్ నిలిచాడు.
50 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు
22.2 ఓవర్లు బౌలింగ్ చేసిన లియాన్ 4 మెయిడెన్ ఓవర్లు వేసి 2.23 సగటుతో 50 పరుగులిచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. పుజారా (17), విరాట్ కోహ్లీ (12), రహానే (17), రవిచంద్రన్ అశ్విన్ (7), వృద్ధిమాన్ సాహా (3), రవీంద్ర జడేజా (3), కేఎల్ రాహుల్ (90), ఇషాంత్‌శర్మ (0)లను లియాన్ పెవిలియన్‌కు చేర్చాడు.
ఐదు వికెట్లు తీసిన ఐదో పర్యాటక బౌలర్
దీంతో బెంగళూరులో ఒక టెస్టులో ఐదు వికెట్లు తీసిన ఐదో పర్యాటక బౌలర్‌గా నాథన్ లియాన్ నిలిచాడు. అంతేకాదు టీమిండియాపై అత్యధిక వికెట్లు (58) తీసిన ఆస్ట్రేలియా బౌలర్‌గా కూడా అవతరించాడు.

భారత్‌పై ఎక్కువ వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్లు:
* నాథన్ లియాన్ 58
* బ్రెట్ లీ 53
* బెనాడ్ 52
* మెక్‌గ్రాత్ 51
* జాన్సన్ 50
* మెకెంజీ 47
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications