కోహ్లీని లయన్ ఇలా అవుట్ చేయడం ఇది ఏడోసారి(వీడియో)

పెర్త్: భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు నాలుగో రోజులో భాగంగా కోహ్లీ బ్యాటింగ్ పైనే అందరి కళ్లు పడ్డాయి. కానీ, ఆ అంచనాలను టీమిండియా కెప్టెన్ కోహ్లీ నిలబెట్టుకోలేకపోయాడు. నాథన్ లయన్ బౌలింగ్‌లో కేవలం 17పరుగులకే అవుటవడంతో అతని బౌలింగ్‌లో ఏడో సారి అవుటై పెవిలియన్ చేరుకున్నాడు. అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుండగా ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనె కోహ్లీని రెచ్చగొట్టాడు. సాధారణంగా కవ్వింపులకు దిగితే కోహ్లీ బ్యాట్‌తోనే సమాధానం చెప్తాడు. అందరూ ఊహించింది కూడా అదే. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ పరుగుల మోత మోగిస్తాడని భావించిన అందరిని నిరాశకు గురిచేస్తూ.. పేలవరీతిలో అవుటయ్యాడు.

287 పరుగుల లక్ష్యంతో టీమిండియా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యంతో సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే భారత్ వికెట్ కోల్పోయింది.

తొలి ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్
ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి చెత్త ప్రదర్శన చేశాడు. స్టార్క్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పరుగులేమీ చేయకుండానే రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే పుజారా (4) కూడా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
లయన్ చేతిలో మరోసారి బలైన కోహ్లీ
దీంతో 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పుజారా ఔటైన తర్వాత కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీ విరామ సమయానికి భారత్ 6.2 ఓవర్లకు గాను 18/2 స్థితిలో నిలిచింది. టీ విరామం అనంతరం మురళీ విజయ్-కోహ్లీల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేసింది. అయితే వీరి జోడి 35 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లీ ఔటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications