100వ టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన రికార్డ్ నెలకొల్పిన లైయన్.. రోహిత్ శర్మ బలి!!

బ్రిస్బేన్: భారత్‌తో జరుగుతున్న బ్రిస్బేన్ టెస్టుతో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. లైయన్ తన టెస్ట్ కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడుతున్నాడు. దీంతో 100 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి చేసిన 13వ ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ రిటైర్మెంట్ అనంతరం.. నాలుగు సంవత్సరాల తర్వాత లైయన్ టెస్ట్ ఫార్మాట్‌లోకి వచ్చాడు. ఆనతి కాలంలోనే లైయన్ ఆసీస్ టెస్ట్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. పది సంవత్సరాల తన కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడాడు.

రోహిత్ నిలకడగా రాణిస్తున్నా:
ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్నా.. ఈ ఫార్మాట్‌లో ఒకే బౌలర్ చేతిలో ఆరు సార్లు ఔటవడం గమనార్హం. గాయం కారణంగా తొలి రెండు టెస్టులు ఆడని రోహిత్ మూడో టెస్టు నుంచి జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలోనే సిడ్నీ టెస్టులో (26, 52) పరుగులు చేశాడు. ఇక గబ్బాలో ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో లైయన్ 100 టెస్టుల్లో 397 వికెట్లతో కొనసాగుతున్నాడు.

అత్యధికంగా ఆరు సార్లు:
ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన నాథన్ లైయన్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్ ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించగా.. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాలేదు. దాంతో లాంగాన్‌లో ఫీల్డర్ మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. రోహిత్ ఈ ఫార్మాట్‌లో అత్యధికంగా ఆరు సార్లు లైయన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడతో సమానంగా లైయన్ ఐదుసార్లు రోహిత్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో రోహిత్‌ను టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్‌గా లైయన్ రికార్డు నెలకొల్పాడు.

మరో మూడు వికెట్లు తీస్తే:
క్రికెట్ ప్రపంచంలోని అన్ని జట్ల బౌలర్లపై రోహిత్ శర్మ ఆధిపత్యం చెలాయిస్తుండగా.. ఈ హిట్‌మ్యాన్‌ని అలవోకగా ఔట్ చేసేస్తూ నాథన్ లైయన్ తాజాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. టెస్టుల్లో ఇప్పటి వరకూ నాథన్ లయన్ బౌలింగ్‌లో 258 బంతుల్ని హిట్‌మ్యాన్ ఎదుర్కొన్నాడు. మరోవైపు లైయన్ ఈ మ్యాచ్‌లో ఇంకో మూడు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా తరఫున 400 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. అతడికన్నా ముందు షేన్ వార్న్ (708), గ్లెన్ మెక్‌గ్రాత్ (563) ఉన్నారు.
మూడో సెషన్ రద్దు.. ముగిసిన రెండోరోజు ఆట!! భారత్ స్కోర్ 62/2!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications