మూడోసారి 10 వికెట్లు: షేన్ వార్న్ రికార్డుని నాథన్ లియాన్ అధిగమించేనా?

హైదరాబాద్: సిడ్నీలో జరిగిన చివరిదైన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ద్వారా షేన్ వార్న్ తర్వాత ఆస్ట్రేలియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నాథన్ లియాన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఆసీస్ తరుపున 96 టెస్టులాడిన లియాన్ 390 వికెట్లు పడగొట్టాడు.
షేన్ వార్న్ విషయానికి వస్తే 145 మ్యాచ్‌ల్లో 708 వికెట్లు పడగొట్టి మొత్తంగా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకకు చెందిన లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 133 మ్యాచ్‌ల్లో 800 వికెట్లు తీసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

మూడో టెస్టులో 10 వికెట్లు
సిడ్నీ వేదికగా న్యూజిలాండ్‌తో సోమవారంతో ముగిసిన మూడో టెస్టులో స్పిన్నర్ నాథన్ లియాన్ 10 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో నాథన్ లియాన్ 10 వికెట్లు తీయడం ఇది మూడోసారి కావడం విశేషం. మూడో టెస్టులో ఆసీస్ 279 పరుగుల తేడాతో గెలిచి మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ సిరిస్‌లో ఆసీస్ క్లీన్ స్వీప్ చేయడంతో 296 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో 360 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఛాంపియన్‌షిప్‌లో భాగంగా టీమిండియా ఇప్పటికే 7 మ్యాచ్‌లు ఆడగా అన్నింట్లో విజయం సాధించింది.

న్యూజిలాండ్ ఖాతాలో ఓ చెత్త రికార్డు
తాజా ఓటమితో న్యూజిలాండ్ ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. 1990ల్లో ఆస్ట్రేలియాతో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన ఏకైక టెస్టులో జాన్ రైట్ న్యూజిలాండ్‌ని విజయం దిశగా నడిపించినప్పటి నుండి న్యూజిలాండ్ ఆడిన మొత్తం 34 టెస్టుల్లో కేవలం 2 టెస్టుల్లో మాత్రమే విజయాం సాధించి.... 24 టెస్టుల్లో ఓటమిపాలైంది. ఈ రెండు విజయాల్లో మొదటిది 1993లో ఆక్లాండ్‌లో మార్టిన్ క్రోవ్ నాయకత్వంలో సాధించింది

గడచిన 26 ఏళ్లలో న్యూజిలాండ్ కేవలం ఒకే టెస్టులో
ఆ తర్వాత రాస్ టేలర్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు 2011లో హోబర్ట్‌లో గెలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టుకు రాస్ టేలర్ కెప్టెన్‌గా వ్వవహారించాడు. దీని అర్ధం గడచిన 26 ఏళ్లలో న్యూజిలాండ్... ఆస్ట్రేలియాపై కేవలం ఒకే ఒక్క టెస్టులో గెలిచింది. ఈ కాలంలో టెస్టు క్రికెట్ ఆడే ఏ పెద్ద దేశం కూడా ఇంతటి చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకోలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications