Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రీడాస్ఫూర్తి మరిచిన లయాన్: బంతి విసిరి సహచర ఆటగాళ్లతో ఎంజాయ్

Nathan Lyon charged with Level I breach for throwing ball at AB de Villiers

హైదరాబాద్: ఐసీసీ నిబంధనలను అతిక్రమించినందుకు గాను ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లయాన్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లను జత చేశారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డర్బన్‌లోని కింగ్స్‌మీడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం నాథన్ లియాన్ కాస్త అత్యుత్సాహాం ప్రదర్శించాడు. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ నాటౌట్ అయిన క్రమంలో నాథన్ లయాన్ ఉద్దేశపూర్వకంగా బంతిని డివిలియర్స్ ఛాతీ మీదకు విసిరి సహచర ఆటగాళ్లతో ఎంజాయ్ చేశాడు. దీనిని ఐసీసీ తప్పుగా పరిగణించింది.

దీంతో మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో జత చేసింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాథన్ లయాన్ బౌలింగ్‌లో డివిలియర్స్‌ని డేవిడ్ వార్నర్ రనౌట్ చేయడంతో ఏబీ డివిలియర్స్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు మాట్లాడుతూ.. లైయన్ ఇది కావాలని చేయలేదని, డివిలియర్స్‌ని ఔట్ చేసిన ఆనందంలో అతను పొరపాటున డివిలయర్స్‌పై బంతి వేశాడని, వెంటనే క్షమాపణ కూడా చెప్పాడని తెలిపారు. కాగా, ఐదో రోజు ఆట ఆరంభానికి ముందు వార్మప్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడుకోవడం విశేషం.

Nathan Lyon charged with Level I breach for throwing ball at AB de Villiers

మరోవైపు ఈ ఘటనపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ మండిపడ్డాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో గెలుస్తామనే ధీమా రావడంతో దూకుడు ప్రదర్శించారని అన్నాడు. లయాన్ చర్యను అనాలోచిత చర్యగా అభివర్ణించాడు. 'నాథన్ లయాన్ అనుభవం కలిగిన క్రికెటర్. ఇది అనాలోచిత చర్య అనే అతడే చెబితే బాగుంటుంది' అని అన్నాడు.

తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో భారీ తేడాతో విజయం సాధించింది.293/9 ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజైన సోమవారం ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా మరో ఐదు పరుగులు జోడించి ఆలౌటైంది. క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతున్న డీకాక్‌‌(83)ను ఎల్బీగా హాజెల్‌వుడ్‌ పెవిలియన్‌కు చేర్చడంతో సఫారీ ఇన్నింగ్స్ ముగిసింది.

దీంతో 417 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌటైంది. తొలి టెస్టులో విజయం సాధించడంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన మిచెల్ స్టార్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Monday, March 5, 2018, 17:57 [IST]
Other articles published on Mar 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+