For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

79 ఏళ్ల ఆసీస్ టెస్టు రికార్డుని బద్దలు కొట్టిన నాథన్ లియాన్

బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ చరిత్రలో 79 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్ట్ మ్యాచ్‌ను స్పిన్ బౌలింగ్‌తో ప్రారంభించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

చివరిసారిగా 1938లో బిల్ ఒ'రీలీ టెస్ట్ మ్యాచ్‌ను స్పిన్ బౌలింగ్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ చరిత్రలో సోమవారం చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన రెండో టెస్ట్‌లో నాథన్ లియాన్ బౌలింగ్‌కు దిగి చరిత్ర సృష్టించాడు.

Nathan Lyon Breaks 79-Year-Old Australian Cricket Record

బంగ్లాదేశ్‌తో సోమవారం మొదలైన రెండో టెస్టులో పేసర్‌ కమిన్స్‌తో కలిసి లియాన్‌ బౌలింగ్‌ ప్రారంభించాడు. ఈ మ్యాచ్‌లో తొలి రోజే లియాన్ ఐదు వికెట్లు తీశాడు. అంతేకాదు 28 ఓవర్లు వేసిన లియాన్ ఆరు ఓవర్లు మెయిడెన్లు వేశాడు.
రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ (5/77) ఐదు వికెట్లతో రాణించాడు.

117 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ రహీమ్(62 నాటౌట్), షబ్బీర్ రెహమాన్(66) హాఫ్ సెంచరీలతో బంగ్లాదేశ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లియాన్ ఐదు వికెట్లలో టాపార్డర్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+