బీబీఎల్‌లో మరో అద్భుతం.. కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న ఎల్లిస్ (వీడియో)

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై జరిగే బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) అంటేనే సంచలనాలకు మారు పేరు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో ఎప్పుడు ఏదోక సంచలనం నమోదు అవుతూనే ఉంటుంది. ఆటగాళ్లే కాకుండా చివరికి అంపైర్లు కూడా ఏదొకటి చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బీబీఎల్ లీగ్ నిర్వాహకులు వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ అవుతాయి. ఈ క్రమంలోనే తాజాగా నాథన్ ఎల్లిస్ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా శనివారం సిడ్నీ థండర్, హోబర్ట్ హారికేన్స్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. సిడ్నీ థండర్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా 12వ ఓవర్‌లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ కొట్టాడు. గాల్లోకి లేచి బంతి వేగంగా బౌండరీ లైన్ వైపు దూసుకొచ్చింది. క్యాచ్ అందుకుందామని హొబర్ట్ ఆటగాడు నాథన్ ఎల్లిస్ ముందుకు కదిలాడు. బంతి తక్కువ ఎత్తులో అతని వైపు వస్తుండడంతో నాథన్ మోకాళ్లపై కూర్చుని క్యాచ్ పట్టేందుకు యత్నించాడు. అయితే అతని అంచనాలు తలక్రిందులు చేస్తూ.. బంతి అతని పైనుంచి వెళ్లింది.
ఈ సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన నాథన్.. మోకాళ్లపైనే కూర్చుని రెండు చేతులు పైకి చాచాడు. బంతి అతని చేతిలో పడ్డాక నాథన్ వెనక్కుపడిపోయాడు. క్యాచ్ అందుకున్న నాథన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక 35 పరుగులు చేసిన ఖవాజా పెవిలియన్ చేరాడు. నాథన్ క్యాచ్ వీడియోపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో హోబర్ట్‌పై థండర్ విజయం సాధించింది.
గురువారం గబ్బా వేదికగా బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరీకేన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మ్యాట్ రెన్‌షా బౌండరీ వద్ద అథ్లెటిక్ విన్యాసాలు చేసి కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసిన అభిమానులు, అంపైర్లు, ఆటగాళ్లు అందరూ ఆశ్చర్యపోయారు. బెన్ కటింగ్ వేసిన ఓ బంతిని మాథ్యూ వేడ్ భారీ షాట్ ఆడాడు. బంతి బౌండరీ లైన్ లోపల పడుతుండగా.. పరుగెత్తుకెళ్లిన రెన్‌షా బంతిని అందుకున్నాడు. ఆ వెంటనే బ్యాలెన్స్ తప్పడంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ దాటాడు. బంతి తిరిగి బౌండరీ లోపలే పడబోతుండగా.. రెన్‌షా మళ్లీ గాల్లోకి ఎగిరి బంతి మైదానంలోకి విసిరాడు. అక్కడే ఉన్న మరో ఫీల్డర్ (టామ్ బాంటన్) బంతిని అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications