త్రోబాక్ పిక్: బికినీలో నటాషా హాట్ అందాలు ..షర్ట్ లేకుండా హార్దిక్!!

ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్ బాలీవుడ్ నటి, సెర్బియాకు చెందిన నటాషా స్టాన్‌కోవిచ్‌తో జరిగిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం 2020 వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్పీడ్ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగాడు. ఆ తర్వాత కేక్ కట్ చేసి తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్టు చేసిన పాండ్యా.. 'నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి' అని క్యాప్షన్ పెట్టాడు.

బికినీలో నటాషా:
ప్రస్తుతం వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత జట్టుకు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు నటాషా స్టాన్‌కోవిచ్‌తో కలిసి విహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబందించిన విషయాలను షేర్ చేసుకునే నటాషా.. తన ఇన్‌స్టాలో తాజాగా టూర్‌కు సంబందించిన పోటోలను పోస్ట్ చేసింది. పాండ్యాతో ఉన్న హాట్ హాట్ చిత్రాన్ని షేర్ చేసింది. నటాషా బికినీలో అదరగొట్టగా.. షర్ట్ లేకుండా ఉన్న హార్దిక్ వావ్ అనిపించాడు.

సోషల్ మీడియాలో వైరల్:
నటాషా స్టాన్‌కోవిచ్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'నటాషా సూపర్' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'బికినీ అదుర్స్' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానుంది.

కివీస్ పర్యటనకు దూరం:
గత సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత వెన్ను నొప్పితో హార్దిక్ పాండ్యా ఆటకు దూరమయ్యాడు. లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టిన హార్దిక్.. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత 'ఎ' జట్టుకు, న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు.

బాలీవుడ్‌లో తెరంగేట్రం:
సెర్బియాలో పుట్టిన నటాషా స్టాన్‌కోవిచ్ ముంబైలో స్థిరపడింది. నటాషా 2013లో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి ప్రత్యేక గీతాల్లో తళుక్కుమంటున్నది. తహాగా మంచి డాన్సర్ అయిన నటాషా.. 'సత్యాగ్రహ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బిగ్ బాస్ 8 లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications