Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Natasa Stankovic: పాండ్యాతో విడాకుల తర్వాత మళ్లీ ప్రేమలో పడిందా?

Natasa Stankovic: గతేడాది క్రికెటర్ హార్దిక్ పాండ్యా నుంచి విడాకులు తీసుకుని నటాషా స్టాంకోవిక్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్ తో ఆమె 2024 జులైలో విడిపోయారు. వారిద్దరు విడిపోయిన అనంతరం స్వదేశానికి తన కుమారుడు అగస్త్యతో వెళ్లిపోయిన నటాషా.. తిరిగి భారత్ కు వచ్చేసింది. ప్రస్తుతం నటాషా, పాండ్యా ఇద్దరు కలిసి కుమారుడు అగస్త్యను పెంచుతున్నారు. నటాషా వర్కవుట్ వీడియోలు చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది. అయితే తాజాగా నటాషా స్టాంకోవిక్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ప్రేమకు వ్యతిరేకం కాదని.. మళ్లీ ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

మళ్లీ ప్రేమలో పడ్డారా?

నటాషా ఇటీవలే (మార్చి 4న) తన 33వ పుట్టినరోజును జరుపుకున్నారు. గత కొంతకాలంగా ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపిస్తోందంటూ కథనాలు వస్తున్నాయి. ఆమె తన స్నేహితుడు, ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ ఇలిక్ తో పబ్లిక్‌గా మీడియాకు కనిపించడంతో ఈ ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మళ్లీ ప్రేమలో పడ్డారా?.. అనే ప్రశ్నకు నటాషా స్పందించారు. మళ్లీ ప్రేమలో పడడానికి తానేమీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు, ప్రేమను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జీవితం ఏం అందించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

Natasha Stankovic Opens Up About Love After Divorce from Hardik Pandya

ప్రేమ ఒక్కటే కాదు..

విడాకులు తీసుకున్న అనంతరం మళ్లీ లవ్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చింది. తాను ప్రేమకు వ్యతిరేకం కాదని..సరైన సమయం వచ్చినప్పుడు సరైన అనుబంధం ఏర్పడుతుందని నమ్ముతున్నానని ఆమె వ్యాఖ్యానించారు. సరైన సమయం వస్తే అన్ని విధాలా నచ్చిన భాగస్వామి దొరకడం ఖాయమని.. ఆ రోజు కోసం వేచి ఉన్నానన్నారు. ప్రేమ ఒక్కటే కాదు.. పరస్పరం గౌరవించుకునే అనుబంధాలను తాను ఇష్టపడతానని పేర్కొంది. అంతే కాదు మళ్లీ యాక్టింగ్ లో రాణించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది.

గతేడాది తనకు చాలా కష్టంగా గడిచిందని.. హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడం తనను బాధించిందని నటాషా తెలిపారు. సవాళ్లను ఎదుర్కొంటేనే మనం రాటుదేలుతామని.. మనుషులు వయసుతో కాకుండా అనుభవాలతో పరిణతి చెందుతారని పేర్కొంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యానని.. అయితే పరస్పరం అంగీకారంతో పాండ్యా, తాను విడాకులు తీసుకున్నామని.. ఇక జీవితంపై దృష్టి సారిస్తున్నట్లు నటాషా చెప్పింది. సినిమాలు మానేసి ఐదేళ్లు అవుతోందని.. సుదీర్ఘ విరామం అనంతరం సినీ పరిశ్రమలో పునరాగమనం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చింది.హార్దిక్ పాండ్యాతో ప్రేమలో పడిన నటాషా.. 2020లో పెళ్లి చేసుకుంది. అదే ఏడాది జులైలో అగస్త్య అనే కుమారుడికి జన్మనిచ్చారు. నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత ఈ జంట విడిపోయింది.

Story first published: Wednesday, March 26, 2025, 10:13 [IST]
Other articles published on Mar 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+