టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆటలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ అతను సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు అందుకున్న క్షణం నుంచి హార్దిక్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఐపీఎల్-2024లో కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా హార్దిక్ దారుణంగా విఫమలయ్యాడు.
హార్దిక్ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగన నిలిచి సీజన్‌ను ముగించింది. ఇక గాయంతో ఆటకు దూరమై ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ బౌలింగ్, బ్యాటింగ్‌లో అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. అంతేగాక మైదానంలో రోహిత్ అభిమానుల నుంచి అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈ సమస్యలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

తన భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు మనస్పర్థలు వచ్చాయి. అంతేగాక వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. విడాకులకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. భరణం కింద హార్దిక్ తన ఆస్తిలో ఏకంగా 70 శాతం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే తన ఆస్తిలో దాదాపు 50 శాతానికి పైగా తన అమ్మ పేరిట ఉండటం హార్దిక్‌కు కాస్త ఉపశమం కలిగిస్తుంది. భవిష్యత్‌లో ఏమైనా వివాదాలు జరిగితే ఆస్తి కోల్పోకుండా ఉండటానికి ఇలా చేశానని గతంలో హార్దిక్ స్వయంగా చెప్పడం గమనార్హం.
హార్దిక్-నటాషా విడాకుల వార్తలు నిజమా? కాదా? అనే విషయాలపై క్లారిటీ లేదు. అయితే ఈ స్టార్ జంట విడిపోతున్నట్లు వస్తున్న వార్తలపై నటాషాను ఓ విలేఖరి ప్రశ్నించారు. దానికి నటాషా షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. 'థ్యాంక్యూ వెరీమచ్' అంటూ సింపుల్‌గా బదులిచ్చారు. డివోర్స్ రూమర్స్‌ను ఖండించకుండా నటాషా కేవలం థ్యాంక్యూ చెప్పడంతో విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ నేపథ్యంలో నటాషా, హార్దిక్ హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు వెల్లువెత్తున్నాయి. గేమ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌లో క్లిష్టపరిస్థితులను హార్దిక్ ఎదుర్కొంటున్నాడని, పాపం హార్దిక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.