Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాండ్యాతో నటాషా ఎంగేజ్‌మెంట్‌.. స్పందించిన మాజీ ప్రియుడు!!

Natasa Stankovics Ex-boyfriend Aly Goni Reacts To Her Engagement With Hardik Pandya

ముంబై: టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌ను త్వరలో పెళ్లిచేసుకోనున్నాడు. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మంగళవారం పాండ్యా-నటాషాలు ఓ హ్యాచ్‌లో ప్రయాణిస్తూ రింగ్స్‌ మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్‌ పంచుకున్నాడు.

నటాషా వీడియో:

నటాషా వీడియో:

నటాషాతో ప్రేమాయణంపై ఇంతకాలం మౌనం వహించిన పాండ్యా.. ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోయిందంటూ కొత్త సంవత్సరం రోజున అభిమానులకు షాక్ ఇచ్చాడు. 'మై తేరా, తు మేరీ జాన్‌, సారా హిందుస్థాన్‌ (నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి). 01.01.2020 #ఎంగేజ్‌డ్‌' అని హార్దిక్‌ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు జత చేశాడు. మరోవైపు నటాషా కూడా ఉంగరం ధరించి తన ప్రేమికుడిని కిస్ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేసింది. వీరిద్దరికీ సంబంధించిన వీడియో, పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

స్పందించిన మాజీ ప్రియుడు:

స్పందించిన మాజీ ప్రియుడు:

నటాషా పోస్టుపై ఆమె మాజీ ప్రియుడు, టీవీ నటుడు అలై గోని స్పందించాడు. హార్ట్‌ సింబల్‌తో కూడిన ఎమోజీ పోస్ట్‌ చేశాడు. ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా కేవలం హార్ట్‌ సింబల్‌ను మాత్రమే గోని పోస్ట్ చేయడం విశేషం. గతంలో కొంతకాలం నటాషా, గోనిలు ప్రేమలో ఉన్నారు. నాచ్‌బేలియెలో వీరిద్దరికి పరిచయం. ఏమైందో తెలియదుకానీ నటాషా, గోనిలు విడిపోయారు.

సత్యాగ్రహ' చిత్రంతో తెరంగేట్రం:

సత్యాగ్రహ' చిత్రంతో తెరంగేట్రం:

మంచి డాన్సర్ అయిన నటాషా స్టాన్‌కోవిచ్‌.. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించిన 'సత్యాగ్రహ' చిత్రంతో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం చేసింది. బిగ్‌బాస్‌ (హిందీ 8)లో పోటీపడటంతో ఆమెకు క్రేజ్‌ పెరిగింది. ఆమె ప్రస్తుతం పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. సెర్బియాలో పుట్టిన నటాషా ముంబైలోనే స్థిరపడింది. త్వరలోనే పాండ్యా-నటాషా వివాహం జరుగనుంది.

 శుభాకాంక్షల వెల్లువ:

శుభాకాంక్షల వెల్లువ:

ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా పాండ్యా-నటాషాలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యువ జంటకు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, అజయ్ జడేజా, రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, యజ్వేంద్ర చహల్‌ వంటి వారు శుభాకాంక్షలు తెలిపారు. అందరిలోకెల్లా కోహ్లీ చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకొంటోంది.

Story first published: Thursday, January 2, 2020, 13:32 [IST]
Other articles published on Jan 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+