T20 World Cup 2021: ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచింది: నాసర్

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 నుంచే భారత్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ మీద భారత్ ఓడిపోయింది. పాక్ మీద కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ మినహా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో సహా అందరూ విఫలమయ్యారు. బౌలింగ్ పరంగానూ ఒక్కరు రాణించలేదు. న్యూజిలాండ్‌తోనైనా కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చి భారత్ గెలవాలని యావత్ భారతం ఆకాంక్షించింది. అయితే ఈ మ్యాచులో కూడా ఎలాంటి పోరాటం చేయకుండానే ప్రత్యర్థికి తలవంచింది. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఓపెనింగ్ జోడీని భారత మేనేజ్‌మెంట్ మార్చింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్‌తో ఇషాన్ కిషన్‌ను పంపింది.

ఆ నిర్ణయమే టీమిండియా కొంపముంచింది:
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్‌డౌన్ బ్యాటర్‌గా వచ్చాడు. అయితే ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. ఈ ఓపెనింగ్ మ్యాచే కోహ్లీసేన కొంప ముంచిందేమోనని అభిమానుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కివీస్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌కు చేరుకుంది. ఇలాంటి అభిప్రాయాన్నే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసర్ హుస్సేన్ వ్యక్తం చేశాడు. ఓపెనింగ్ మార్చడమే భారత్ చేసిన అతిపెద్ద పొరపాటని పేర్కొన్నాడు. రాహుల్-రోహిత్ జోడీని విడదీయకుండా ఉండాల్సిందని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఇషాన్‌ను తీసుకొచ్చి ఓపెనింగ్‌కు పంపడం సరికాదని నాసర్ పేర్కొన్నాడు.

ఆదుకునే ఆటగాడు కరవుతున్నాడు:
'టీమిండియాలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే కొన్ని సార్లు సెలక్షన్ సమస్యగా మారింది. హార్దిక్ పాండ్యా కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడుతున్నాడు. జట్టు సమతూకానికి ప్రత్యామ్నాయం కోసం వేరే ఎంపికకు వెళ్లాల్సింది. ఓపెనర్లు రోహిత్-రాహుల్‌ను విడగొట్టకుండా ఉంటే బాగుండేది. ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నీల్లో భారత్ బ్రాండ్ క్రికెట్‌ను నిర్భయంగా ఆడటం లేదు. నేను భారత్‌ను ఫేవరేట్ జట్టుగా పేర్కొన్నా. ఎందుకంటే వాళ్లు ఇక్కడే ఐపీఎల్ ఆడారు. స్టార్ ప్లేయర్లు ఉన్నారు. భారత్ టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంటుంది. అయితే ఒక్కోసారి మిడిలార్డర్‌లో ఆదుకునే ఆటగాడు కరవుతున్నాడు. తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ రాణించినా.. మిగతా వారు త్వరగానే పెవిలియన్ చేరారు. అందుకే ఎప్పుడూ ప్లాన్-బీ ఉండాలి. ఎవరు ఎప్పుడు దిగాలో దానిపై ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి. అయితే టీటీమిండియా వద్ద అది లేదు' అని నాసర్ అన్నాడు.

ఏ టీమ్ గెలిచినా అంతే:
సూపర్ 12 చివరి మ్యాచ్ భారత్, నమీబియా జట్ల మధ్య జరుగుతోంది. భారత్, నమీబియాలు ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పటికే సెమీ ఫైనల్‌కు 4 టీమ్‌లు వెళ్లిపోయాయి. కాకపోతే పాయింట్స్ టేబుల్‌లో తమ స్థాయిని మార్చుకోవడం తప్పితే.. ఏ టీమ్‌కు కూడా ఈ మ్యాచ్‌ను గెలవడంతో వచ్చే లాభమే లేదు. రెండు టీమ్స్ ఈ మ్యాచ్ ముగిశాక ఇంటి దారి పట్టాల్సిందే. సెమీ ఫైనల్స్‌కు గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్వాలిఫై కాగా.. గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ వెళ్లాయి. నవంబర్ 10న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య సెమీస్ మ్యాచ్ జరగనుండగా.. నవంబర్ 11న పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమ్స్ మధ్య నవంబర్ 14న పైనల్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications