లార్డ్స్‌లో దాదా: షర్టుతో చూడటం చాలా సంతోషం అంటూ హుస్సేన్ ట్వీట్

హైదరాబాద్: ఇంగ్లాండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో షర్టు తీసి గాల్లో ఊపుతూ చేసిన సందడి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెరీర్‌లోనే నిలిచిపోయే సన్నివేశాల్లో ఒకటి. నాట్ వెస్ట్ ట్రోఫీ సందర్భంగా చోటు చేసుకున్న ఈ సన్నివేశం ప్రతి భారత క్రికెట్ అభిమానికి ఇప్పటికీ గుర్తే.

లార్డ్స్ మైదానంలో సౌరవ్ గంగూలీ
ఇప్పుడు అదే లార్డ్స్ మైదానంలో సౌరవ్ గంగూలీ మరోసారి కనిపించాడు. ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘమైన సిరిస్‌లో సౌరవ్ గంగూలీ కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగూలీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే ఉన్నాడు.

2-1తేడాతో టీ20 సిరిస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన
మూడు టీ20ల సిరిస్‌ను కోహ్లీసేన 2-1తేడాతో కైవసం చేసుకుని ఇంగ్లాండ్ పర్యటనను ఘనంగా ప్రారంభించింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ జులై 12 (గురువారం) నుంచి నాటింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. దీంతో కామెంటేటరీ బాధ్యతల నుంచి కాస్త విరామం దొరికడంతో లార్డ్స్ మైదానానికి వెళ్లాడు.
బ్యాక్ ఎట్ లార్డ్స్ అంటూ గంగూలీ ట్వీట్
ఈ సందర్భంగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సెల్ఫీ దిగి "బ్యాక్ ఎట్ లార్డ్స్.. నా కెరీర్ ఎక్కడైతే ప్రారంభించానో అక్కడే" అని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నసీర్ హుస్సేన్ స్పందిస్తూ "అదే బాల్కనీలో నువ్వు మరోసారి... కానీ, ఈ సారి నిన్ను షర్టుతో చూడటం చాలా సంతోషంగా ఉంది" అని ట్వీట్ చేశాడు.
తొలి టెస్టులోనే సెంచరీ నమోదు చేసిన గంగూలీ
1996లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి గంగూలీ అరంగేట్రం చేసిన సౌరవ్ గంగూలీ తన మొదటి టెస్టుని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఆడాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ సెంచరీతో(131) నమోదు చేశాడు. తద్వారా అరంగేట్రం చేసిన టెస్టులోనే సెంచరీ చేసిన ఆటగాడిగా గంగూలీ అరుదైన ఘనత సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications