Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాట్‌వెస్ట్ సిరీస్ విజయంపై ఐసీసీ పోస్ట్.. గుర్తు చేసుకోనన్న హుసేన్‌.. ఎందుకంటే?!!

Nasser Hussain reacts to ICC’s post on India’s 2002 Natwest Tropny win

లండన్: నాట్‌వెస్ట్‌ సిరీస్‌-2002 ఫైనల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా 326 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించింది. టీమిండియా సాధించిన అద్భుత విజయాల్లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌ ఒకటి. ఈ ఉత్కంఠ పోరులో భారీ ఛేదనకు దిగిన భారత్‌.. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన ఓ దశలో ఓటమి అంచుల్లో చిక్కుకుంది. అయితే యువ ఆటగాళ్లు మహ్మద్‌ కైఫ్‌ (87), యువరాజ్‌ సింగ్‌ (69) అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌ మ్యాచ్‌ గెలిచింది. దీంతో టీమిండియా ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందుకుంది.

నాకు గుర్తు లేదు:

అప్పటి అద్భుత విజయాన్ని గుర్తుచేసిన అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) బుధ‌వారం ట్విట్ట‌ర్లో ఆ మ్యాచ్‌కు సంబందించిన ఓ ఫొటోను షేర్ చేసింది. ఇది ఏ మ్యాచ్‌కు సంబంధించిన‌వో గుర్తున్నాయా అని కాప్షన్ పెట్టింది. దీనికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ నాసిర్ హుస్సేన్ బ‌దులిస్తూ.. 'నాకు గుర్తు లేదు. అస‌లు గుర్తు చేసుకోవాల‌నుకోవ‌డం లేదు' అని రాసుకొచ్చాడు. హుసేన్‌ ఆలా ఎందుకు అన్నాడంటే.. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి.

కైఫ్‌ 87 పరుగులు చేసి నాటౌట్:

కైఫ్‌ 87 పరుగులు చేసి నాటౌట్:

లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 325 ప‌రుగులు చేసింది. నాసిర్ హుసేన్ సెంచరీ బాదాడు. అనంత‌రం ల‌క్ష్య‌ఛేద‌న‌లో 146 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి ఓట‌మి అంచుల్లో నిలిచింది. యువరాజ్, కైఫ్‌ ఆదుకోవడంలో భారత్ గెలుపుపై నమ్మకంగా ఉంది. ఈ క్రమంలో యువీ పెవిలియన్ చేరాడు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బాధ్యతాయుతంగా కైఫ్‌ బ్యాటింగ్ చేసి మరో మూడు బంతులు మిగిలుండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్‌ను టీమిండియాకు అందించాడు.

యువీ ఔటవ్వగానే ఓడిపోతామనుకున్నా

యువీ ఔటవ్వగానే ఓడిపోతామనుకున్నా

లాక్‌డౌన్ సందర్భంగా నాటి చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకున్న కైఫ్‌, యువీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా కైఫ్‌ మాట్లాడుతూ ఆ ఫైనల్ మ్యాచ్‌లో యువీ ఔటవ్వగానే భారత్ ఓడిపోతుందని అనుకున్నట్లు చెప్పాడు. 'యువీ ఆరోజు నువ్వు ఔటవ్వగానే మ్యాచ్‌ ఓడిపోతామనుకున్నా. మనం గెలుస్తామనుకోలేదు. అప్పటికే నేను కుదురుకున్నాను. నువ్వు క్రీజులో ఉన్నావు. దాంతో చివరివరకూ మనం క్రీజులో ఉంటే కచ్చితంగా గెలుస్తామని భావించా. కానీ.. నువ్వు ఔటయ్యేసరికి చాలా నిరాశ చెందా' అని కైఫ్‌ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నాడు.

Story first published: Wednesday, May 6, 2020, 19:53 [IST]
Other articles published on May 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+