Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీతో పాటు నా బాల్య స్నేహితుడు కూడా అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

Nasser Hussain names 4 players he would pay to watch

లండన్: ఇంగ్లండ్ అత్యంత విజయవంతమైన సారథి నాజర్ హుస్సేన్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని కొనియాడాడు. అతడు వ్య‌క్తిగ‌త రికార్డుల‌కు పెద్ద‌గా విలువివ్వ‌డ‌ని హుస్సేన్ పేర్కొన్నాడు. కోహ్లీతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, హుస్సేన్ బాల్య స్నేహితుడు డేవిడ్ గోవర్ కూడా అత్యుత్తమ ఆటగాడు అని చెప్పుకొచ్చాడు.

ఎంత ఖర్చు అయినా చేస్తా:

ఎంత ఖర్చు అయినా చేస్తా:

కరోనా వైరస్ కార‌ణంగా క్రీడా టోర్నీల‌న్నీ ర‌ద్దు కావ‌డంతో ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన ఆట‌గాళ్లు సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉంటున్నారు. ఇంగ్లండ్ మాజీ సార‌థి డెయిలీ మెయిల్‌తో అభిమానుల‌తో త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు, గతంలో ఎవరి ఆటను చూడటానికి ఇష్టపడుతారు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి హుస్సేన్ నలుగురి పేర్లను చెపుతూ.. వారి ఆట చూడడానికి ఎంత ఖర్చు అయినా చేస్తా అని చెప్పుకొచ్చాడు.

వ్య‌క్తిగ‌త రికార్డుల‌కు విలువివ్వడు:

వ్య‌క్తిగ‌త రికార్డుల‌కు విలువివ్వడు:

అందరికంటే ముందుగా విరాట్ కోహ్లీ ఆటను చూడడానికి ఇష్టపడతా, అతడే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని నాజర్ హుస్సేన్ తెలిపాడు. 'ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో ల‌క్ష్య‌ఛేద‌న సమ‌యంలో కోహ్లీ బ్యాటింగ్ చేసే తీరు అద్భుతంగా ఉంటుంది. ఎదురుగా ఎంత ల‌క్ష్య‌మున్నా ఏ మాత్రం ఆందోళ‌న చెంద‌డు. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు సాగుతాడు. ఈ క్ర‌మంలో కోహ్లీ వ్య‌క్తిగ‌త మైలురాళ్ల‌కు ఏనాడు ప్రాధాన్యం ఇవ్వ‌డు. కేవ‌లం జ‌ట్టు గెలిచిందా లేదా అనేదే అత‌డికి ముఖ్యం' అని హుస్సేన్ అన్నాడు.

అన్వర్, లారాలు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌:

అన్వర్, లారాలు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌:

పాకిస్తాన్ తరఫున 55 టెస్టులు, 247 వన్డేలు ఆడిన మాజీ ప్లేయర్ సయీద్ అన్వర్ కూడా నాజర్ హుస్సేన్ ఎలైట్ జాబితాలో రెండో స్థానం దక్కించుకున్నాడు. అన్వర్ ఆఫ్-సైడ్ ఆడే షాట్లు చూడడానికి చాలా బాగుంటాయని పేర్కొన్నాడు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాకు మూడో స్థానం ఇచ్చాడు. 'లారా పాత ఫుటేజ్ చూసినప్పుడు అతను ఇంత బాగా బ్యాటింగ్ ఎలా చేస్తాడా అనిపిస్తుంది. నేను అతడు ఆడినప్పుడు ఎక్కువ కెప్టెన్సీ చేయలేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను. మైక్ అథర్టన్ ఫీల్డర్‌ను పరిగెత్తిస్తే.. లారా ఫీల్డర్‌ల మధ్యలోంచి బంతిని బౌండరీ తరలిస్తాడు' అని హుస్సేన్ తెలిపాడు.

చిన్ననాటి హీరో డేవిడ్ గోవర్‌ కూడా:

చిన్ననాటి హీరో డేవిడ్ గోవర్‌ కూడా:

తన చిన్ననాటి హీరో డేవిడ్ గోవర్‌ ఆటను చూడటానికి కూడా నాజర్ హుస్సేన్ ఇష్టపడుతాడట. కోహ్లీతో పాటు గోవర్‌ కూడా అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని పేర్కొన్నాడు. అయితే తన అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ జాబితాలో చివరి స్థానం ఇచ్చాడు. 'లీసెస్టర్షైర్ జట్టు తరపున గోవర్‌ ఆడినప్పుడు.. నేను కవర్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నా. అతడు కొట్టిన బంతి నేను కదిలిలోపే బౌండరీ దాటింది. ఇప్పటికీ నా కళ్లలో అది అలానే ఉంది' అని హుస్సేన్ చెప్పుకొచ్చాడు. డేవిడ్ గోవర్ ఇంగ్లండ్ తరఫున 117 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 8,231 పరుగులు సాధించాడు.

Story first published: Monday, April 20, 2020, 14:32 [IST]
Other articles published on Apr 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+