For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆఖరి మ్యాచ్‌లో కుక్ ఎలా ఆడినా.. అతనే గ్రేట్'

Nasser Hussain, Michael Atherton Hail Alastair Cook as England’s Greatest Batsman

కెన్నింగ్‌టన్: టెస్టు సిరీస్‌లో భాగంగా జరగనున్న ఆఖరిదైన ఐదో టెస్టులో ఆడేందుకు ఇంగ్లాండ్ జట్టు సిద్ధమైపోయింది. ఈ క్రమంలో మంగళవారం ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ పదమూడు మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో తన టెస్టు కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడనున్న నాజర్ హుస్సేన్‌కు అవకాశం కల్పిస్తూ.. జట్టును అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.

కుక్ రిటైర్మెంట్‌పై తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ స్పందించాడు. 'ఐదో టెస్టుకి ఆతిథ్యమివ్వనున్న ఓవల్ మైదానంలో అలిస్టర్ కుక్ ఎలా ఆడతాడో తెలీదు. కానీ.. ఎలా ఆడినా.. అతను ఇంగ్లాండ్ గొప్ప బ్యాట్స్‌మెన్. సుదీర్ఘకాలం అద్భుతంగా క్రికెట్ ఆడాడు' అని కొనియాడాడు. భారత్‌తో జరుగుతున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు టెస్టులు ముగియగా 33ఏళ్ల అలిస్టర్ కుక్ కనీసం ఒక్క మెరుగైన ఇన్నింగ్స్‌ కూడా ఆడలేకపోయాడు.

ఈ కారణంగానే విమర్శలు రావడంతో అతను రిటైర్మెంట్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌తో శుక్రవారం నుంచి జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్‌‌ తన కెరీర్‌లో చివరిదంటూ అనూహ్యంగా సోమవారం అలిస్టర్ కుక్ తన రిటైర్మెంట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌తో విదర్భ వేదికగా 2006 మార్చిలో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఐదు రోజుల ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన అలిస్టర్ కుక్.. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 60, 104 పరుగులతో రాణించాడు.

1
42378

దీంతో.. అనతికాలంలోనే అతని‌కి జట్టులో సుస్థిర స్థానం లభించింది. వన్డేలు, టీ20లతో పాటు టెస్టుల్లోనూ నమ్మదగిన ఆటగాడిన గుర్తింపు పొందిన ఈ ఓపెనర్.. నాలుగేళ్లుగా కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 160 టెస్టులాడి ఏకంగా 12,254 పరుగులు చేశాడు. ఇందులో 5 ద్విశతకాలు ఉండగా.. 32 సెంచరీలు ఉన్నాయి.టెస్టుల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కుక్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, September 4, 2018, 18:15 [IST]
Other articles published on Sep 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+