Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'రోహిత్ ఓ అరగంట బౌలర్లను ‌వదిలేయాలి.. అప్పుడే విజయవంతమవుతాడు'

Nasser Hussain Claims Rohit Sharma Needs To Do Just THIS To Be successful in Australia

లండన్: ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ విజయవంతమవ్వాలంటే మొదటి అరగంట బౌలర్లను ‌వదిలేయాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ నాజర్ హుస్సేన్‌ సూచించాడు. హిట్‌మ్యాన్ తొలి అరగంట క్రీజులో గడిపితే.. ఆ తర్వాత పరుగుల వరద పారించగలడని అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పడు భారత్‌తో మ్యాచ్ అంటేనే ఓ యుద్ధంలా ఉండేదని హుస్సేన్‌ తెలిపాడు.

 రోహిత్‌ ఓపెనర్‌ కాకపోతే:

రోహిత్‌ ఓపెనర్‌ కాకపోతే:

తాజాగా జరిగిన ఓ ఇంటర్యూలో ప్రముఖ వ్యాఖ్యాత నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ... 'టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఓపెనర్‌ కాకపోతే నేను వేరే ఆట చూస్తుంటా. మీ అభిమాన ఆటగాడు ఎవరని తోటి క్రికెటర్లను అడిగితే.. చాలామంది రోహిత్‌ పేరే చెప్తారు. తోటి ఆటగాళ్లంతా అతడి బ్యాటింగ్‌ను అంతలా ఆస్వాదిస్తారు. షాట్లు ఆడేందుకు హిట్‌మ్యాన్ దగ్గర చాలా సమయం ఉంటుందని వాళ్లు అంటారు' అని అన్నాడు. హుస్సేన్ 96 టెస్ట్ మ్యాచ్‌లు, 88 వన్డే మ్యచ్‌లలో ఇంగ్లాండ్ తరుపున ఆడాడు.

 రోహిత్‌ అరగంట ఆగితే చాలు:

రోహిత్‌ అరగంట ఆగితే చాలు:

వన్డేల్లో గొప్ప ఆటగాడిగా నిరూపించుకున్న రోహిత్‌ శర్మ టెస్టుల్లో ఇంకా స్థాయికి తగ్గ ఆట ప్రదర్శించలేదని నాజర్ హుస్సేన్ అన్నాడు. 'టెస్టుల్లో రోహిత్ ఇటీవలే కుదురుకున్నాడు. స్వదేశంలో శతకాలు బాదాడు. ఇక విదేశీ పర్యటనలో విజయవంతమవడానికి రోహిత్‌ చేయాల్సింది ఒక్కటే. తొలి అరగంట క్రీజులో గడపాలి. ఈ అరగంట నిన్ను వదిలేస్తున్నానని బౌలర్‌కు చెప్పాలి. ఆ తర్వాత పరుగుల వరద పారించగల సత్తా అతనికి ఉంది' అని నాసిర్‌ చెప్పాడు. రోహిత్ భారత్ తరపున 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లు ఆడాడు.

భారత్‌తో మ్యాచ్ అంటే యుద్ధంలా ఉండేది:

భారత్‌తో మ్యాచ్ అంటే యుద్ధంలా ఉండేది:

'సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు భారత్‌తో మ్యాచ్ అంటే ఎంతో కష్టంగా ఉండేది. జట్ల మధ్య ఓ యుద్ద వాతావరణం ఉండేది. భారత జట్టు ఆడే విధానాన్నే గంగూలీ మార్చేశాడు' అని నాసిర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు. భారత జట్టు ఓ బలమైనదిగా మారడానికి గంగూలీనే కారణమన్నాడు. ప్రస్థుత భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మంచి ఆటగాడని, ప్రత్యర్థి జట్టుకు బలమైన పోటీని ఇస్తాడని హుస్సేన్ పేర్కొన్నాడు. మ్యాచ్‌ను గెలిచేందుకు అవసరమైన పోటీ తత్వాన్ని తోటి ఆటగాళ్ళలో కలిగిస్తాడని చెప్పుకొచ్చాడు.

చిరకాల కోరికను మోర్గాన్ నెరవేర్చాడు:

చిరకాల కోరికను మోర్గాన్ నెరవేర్చాడు:

'ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. వన్డే మ్యాచ్‌లలో ఇంగ్లండ్ ఆటతీరును ఎంతగానో మెరుగుపరిచాడు. నేను చూసిన మంచి అటగాళ్ళలో మోర్గాన్ ఒకడు. క్రికెట్ ప్రపంచ‌కప్‌‌లో గొప్పగా రాణించి జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు. కప్పు గెలవాలన్న చిరకాల కోరికను నెరవేర్చాడు. మోర్గాన్ ఎంతటి ఒత్తిడి కలిగించే పరిస్థితిలోనైనా చాలా ప్రశాంతంగా ఉంటాడు. జోస్ బట్లర్, జానీ బెయిర్ ‌స్టో, జాసన్ రాయ్ వంటి మెరుగైన ఆటగాళ్ళు అతనికి అండగా నిలిచారు' హుస్సేన్ అన్నాడు.

ఈరోజే అరంగేట్రం చేశా: గంగూలీ

Story first published: Saturday, June 20, 2020, 15:25 [IST]
Other articles published on Jun 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+