For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ మాజీ కెప్టెన్.. బస్ డ్రైవర్ అని పిలిచేవాడు: కైఫ్

Nasser Hussain Called Mohammad Kaif a ‘Bus Driver’ in NatWest Series Finals

ఢిల్లీ: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ తనను 'బస్ డ్రైవర్' అని పిలిచేవాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మాద్ కైఫ్ తెలిపారు. మైదానంలోని ఫీల్డింగ్ నైపుణ్యాలతోనే తనను అభిమానులు గుర్తించారని చెప్పారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇష్టమైన క్రికెటర్ అని, సౌరవ్ గంగూలీ ఉత్తమ కెప్టెన్ అని కైఫ్ పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించండని కోరారు. గతంలో యూపీ నుంచి ఎక్కువ మందికి క్రికెట్‌లో అవకాశాలు రాలేదు. నాన్న క్రికెట్ ఆడారు కాబట్టి.. నేను కూడా అతని అడుగుజాడల్లో నడిచానన్నారు.

బస్ డ్రైవర్ అని పిలిచేవాడు

బస్ డ్రైవర్ అని పిలిచేవాడు

మహ్మాద్ కైఫ్ తాజాగా హలో యాప్ నిర్వహించిన ‌ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ‌ఇంటర్వ్యూ సందర్భంగా ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్ తనను బస్ డ్రైవర్‌గా సంబోంధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను చాలా ఎక్కువగా మాట్లాడేవాడినని, దీంతో హుస్సేన్ తనను 'బస్ డ్రైవర్' అని పిలిచాడని కైఫ్ తెలిపారు. అదే సమయంలో ఈ బస్ డ్రైవర్‌ది చెడ్డ ఇన్నింగ్స్ కాదని అతడితో చెప్పినట్లు కైఫ్ చెప్పారు. మహ్మద్‌ కైఫ్‌ భారత్ తరఫున 13 టెస్టులు, 125 వన్డేలు ఆడారు.

జడేజా అత్యుత్తమ ఫీల్డర్

జడేజా అత్యుత్తమ ఫీల్డర్

మహ్మాద్ కైఫ్ మాట్లాడుతూ... 'నా ఫీల్డింగ్ నైపుణ్యాలతోనే అభిమానులు నన్ను గుర్తించారు. ఫీల్డింగ్‌తో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల నుంచి గౌరవం అందుకున్నా. వారిద్దరు నన్ను చాలా సందర్భాల్లో మెచ్చుకున్నారు. ఇక ప్రస్తుత క్రికెటర్లలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా అత్యుత్తమ ఫీల్డర్. ఒక్కోసారి అతని ఫీల్డింగ్ నమ్మశక్యంగా ఉంటుంది. మొహమ్మద్ అజారుద్దీన్, రాబిన్ సింగ్‌లు కూడా మంచి ఫీల్డర్లు' అని పేర్కొన్నారు.

ఉత్తమ కెప్టెన్ దాదానే

ఉత్తమ కెప్టెన్ దాదానే

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా మంచి ఆటగాడని, అతడు గనుక తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోగలిగితే అద్భుతాలు చేయగలడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ కన్నా.. సచిన్ టెండూల్కర్ ఇష్టమైన క్రికెటర్ అని చెప్పారు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనీ మంచి కెప్టెన్‌లు అని.. అయితే ఉత్తమ కెప్టెన్ మాత్రం దాదానే అని పేర్కొన్నారు. ఫాస్ట్ బౌలర్లలో జహీర్ ఖాన్ ఉత్తమమన్నారు. ఇక కుంబ్లే బెస్ట్ స్పిన్నర్ అని కితాబిచ్చారు. జాన్ రైట్ కన్నా గ్రెగ్ చాపెల్ ఉత్తమ కోచ్ అని మహ్మాద్ కైఫ్ చెప్పుకొచ్చారు.

ధోనీకి మద్దతు

ధోనీకి మద్దతు

ఇంతకుముందు ఎంఎస్ ధోనీకి మహమ్మద్‌ కైఫ్‌ మద్దతుగా నిలిచారు. ధోనీలో ఇంకా చాలా ఆట మిగిలిఉందన్నారు. ఐపీఎల్‌ ద్వారా ధోనీని అంచనా వేయడం సరికాదని, అతడు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ ధోనీ ఆడాలని కైఫ్‌ అభిప్రాయపడ్డారు. 'ఐపీఎల్‌లో ధోనీ ఎలా ఆడబోతున్నాడో, టీ20 ప్రపంచకప్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్‌లో ధోనీ ప్రదర్శన చూశాక టీ20 ప్రపంచకప్‌లో చోటుపై చర్చలు జరుగుతాయని చాలా మంది అంటున్నారు. కానీ నేను అలా ఆలోచించడం లేదు' అని కైఫ్‌ అన్నారు.

Story first published: Sunday, May 10, 2020, 10:50 [IST]
Other articles published on May 10, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+