Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా కంటే మా బౌలర్ బెటర్ - బాబర్ అజామ్

జస్‌ప్రీత్ బుమ్రా.. ప్రస్తుత ప్రపంచ అత్యుత్తమ బౌలర్. తన స్పెల్‌తో మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. ప్రత్యర్థిని ఔట్ చేయాలన్నా, స్కోరును కట్టడి చేయాలన్నా అందరిలోనూ బుమ్రానే దిట్ట. బుల్లెట్ లాంటి యార్కర్లు, స్లో బంతులు, ఊహించని బౌన్సర్లు.. ఇలా వైవిధ్యమైన బంతులతో బ్యాటర్లను బుమ్రా ఇబ్బంది పెడుతుంటాడు.

అయితే బుమ్రా కంటే తమ బౌలర్ నషీమ్ షా ఉత్తమమని పాకిస్థాన్ వైట్ బాల్ కెప్టెన్ బాబర్ అజామ్ పేర్కొన్నాడు. ఓ కార్యక్రమంలో అజామ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అసలేం జరిగిందంటే.. 'అది టీ20 మ్యాచ్. ఒకే ఓవర్ మిగిలింది. ప్రత్యర్థి 10 పరుగులు చేయకుండా కట్టడి చేస్తే విజయం సాధించగలరు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ బౌలర్‌ను ఎంచుకుంటారు? నషీమ్ షా లేదా బుమ్రానా?' అని బాబర్ అజామ్‌ను యాంకర్ ప్రశ్నించాడు.

Naseem Shah is likely to do better than Jasprit Bumrah- Babar Azam

'నసీమ్ షాను ఎంచుకుంటాను. గాయం నుంచి గొప్పగా కోలుకుని నసీమ్‌ షా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. అతనికి ఎంతో నైపుణ్యం ఉంది. పాకిస్థాన్‌‌లో ఇలాంటి ప్రతిభ ఉన్న ప్లేయర్లు ఉండటం చాలా అరుదు. అయితే షాహిన్ అఫ్రిది వంటి మరికొందరు అద్భుత ఆటగాళ్లు కూడా ఉన్నారు. అఫ్రిదికి తనకంటూ ప్రత్యేకమైన క్లాస్ టాలెంట్ ఉంది. షాహిన్ అఫ్రిది బాటలోనే నసీమ్ పయనిస్తున్నాడు'' అని బాబర్ అజామ్ అన్నాడు.

20 ఏళ్ల నషీమ్‌షా ఆసియా కప్‌లో గాయపడ్డాడు. అనంతరం వన్డే వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. అతడు తన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. అయితే బాబర్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. నసీమ్ షాను కొనియాడటానికి బుమ్రాను తక్కువ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌‌లో బుమ్రా 16 పరుగుల కంటే ఎక్కువ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నాయని? మీ బౌలర్ల పరిస్థితి ఏంటని? కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ఇటీవల బాబర్ అజామ్‌‌ను పాకిస్థాన్ క్రికెటర్ బోర్డు తిరిగి కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలసిందే. వన్డే వరల్డ్ కప్‌-2023లో పాకిస్థాన్ పేలవమైన ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బాబర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వన్డే ఫార్మాట్‌‌తో పాటు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు. అయితే మరికొన్ని రోజుల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని బాబర్‌ను పాక్ బోర్డు తిరిగి కెప్టెన్‌గా ఎంపికచేసింది.

Story first published: Monday, April 8, 2024, 14:48 [IST]
Other articles published on Apr 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+