
దుబాయ్‌లో ఉండే వేడి, అలాగే హ్యుమిడిటీ వల్ల ఫాస్ట్ బౌలర్లకు నరకం కన్పిస్తుంది. అందువల్ల పేసర్లు తొందరగా అలసిపోతుంటారు. ఇకపోతే కొందరు గాయపడుతుంటారు. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఆసియా కప్-2022 మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్లు నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లు ఇలాగే చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రౌఫ్ తన మూడో ఓవర్ నుంచి కాళ్లలో కండరాలు పట్టుకుని ఇబ్బంది పడ్డాడు.
అలాగే తన టీ20 కెరీర్ అరంగేట్రం చేసిన యువ పేసర్ నసీమ్ షా కూడా తన చివరి ఓవర్లో విపరీతమైన పెయిన్ ఎదుర్కొన్నాడు. ఈ 19ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్..తన తొలి ఓవర్లోనే భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను గోల్డెన్ డక్‌గా ఔట్ చేశాడు.. అలాగే సూర్యకుమార్ యాదవ్ వికెట్ కూడా తీశాడు. అయితే కీలకమైన టైంలో నాలుగో ఓవర్ వేసిన నసీమ్ షా చాలా ఇబ్బంది పడుతూ బౌలింగ్ చేశాడు.
అతను రవీంద్ర జడేజాకు బౌలింగ్ చేసే టైంలో రైట్ కాల్ పట్టేయడంతో రెండు మూడు సార్లు కిందపడిపోయాడు. ఇక నాలుగో బంతి అయ్యాక అతని వల్ల కాలేదు వెంటనే ఫిజియోలు వచ్చి అతనికి చికిత్స చేశారు. నాలుగో బంతికి నసీమ్ షా జడేజాను ఎల్బీడబ్ల్యూ చేశాడు కూడా. అయితే రివ్యూలో మాత్రం నాటౌట్ అని తేలింది. ఇక ఫిజియోలు వచ్చి వెళ్లాక చివరి రెండు బంతుల్లో ఓ సిక్స్ సమర్పించుకున్న నషీమ్.. ఇక గ్రౌండ్ వీడాడు.
అతను గ్రౌండ్ నుంచి వెళ్తున్నప్పుడు గుక్క పట్టి ఏడ్చుకుంటూ వెళ్లాడు. అతను తరచూ చేతితో కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లాడు. తన చివరి ఓవర్లో వికెట్ తీయలేకపోయాను.. పైగా సిక్స్ ఇచ్చాను అనే బాధతో అతను తీవ్రంగా కలత చెందినట్లు అర్థమవుతుంది. కీలక సమయంలో జట్టుకు ఉపయుక్తమైన బౌలింగ్ వేయాల్సింది కానీ వేయలేకపోయాననే వేదనలో ఈ కుర్రాడు గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూం చేరేదాక ఏడ్చుకుంటూనే వచ్చాడు. ఇక డ్రెస్సింగ్ రూంలో సహచర క్రికెటర్లు, కోచ్‌లు అతన్ని మెచ్చుకుంటూ గ్రీట్ చేశారు. అలాగే ఓదార్చారు. నసీమ్ షా భావోద్వేగానికి గురైన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇకపోతే తన తొలి టెస్టులో హ్యాట్రిక్‌తో సహా ఐదు వికెట్లు తీసిన నసీమ్.. ఇండియాతో మ్యాచ్‌లో 4ఓవర్లలో 27పరుగులు మాత్రమే ఇచ్చి 2కీలక వికెట్లు తీశాడు. మ్యాచ్ తర్వాత.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మాట్లాడుతూ.. యువ పేసర్‌కు అయిన గాయంపై స్పందించాడు. అది చాలా చిన్న విషయమే.. తిమ్మిరితో కండరాలు పట్టేసుకున్నాయి. సెట్టయిపతాడు అని పేర్కొన్నాడు. ఇకపోతే పాకిస్థాన్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడుతుంది. సూపర్ 4దశకు చేరుకోవడానికి హాంకాంగ్‌ను పాక్ ఓడించాలి.