Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్.. భారత్, ఆసీస్ ప్రధానులు ఏమన్నారంటే?!!

 Narendra Modi extends best wishes to India, Australia ahead of Women’s T20 World Cup final

న్యూఢిల్లీ: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌ మెగా ఫైనల్ ఆదివారం మెల్‌బోర్న్‌లో జరగనుంది. టైటిల్ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడనుంది. ఆసీస్‌ వరుసగా ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడుతుండగా.. భారత్ మాత్రం తొలి సారిగా ఫైనల్‌ ఆడనుంది. తొలిసారి కప్‌ను గెలవాలని హర్మన్‌ప్రీత్ సేన ఉవ్విళ్లూరుతుండగా.. సొంత అభిమానుల మధ్య ఐదోసారి కప్‌ను ముద్దాడాలని మెగ్‌ లానింగ్‌ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

కప్పు తెస్తారని ఆశగా:

లీగ్ దశలో అన్ని మ్యాచుల్లోనూ గెలిచి ఓటమన్నదే ఎరుగని హర్మన్‌ప్రీత్ సేన అదే జోరు కొనసాగించి దేశానికి కప్పును అందించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు దేశ ప్రజలు అందరూ ఇప్పడు అమ్మాయిలవైపు కప్పు తెస్తారని ఆశగా చూస్తున్నారు. భారత జట్టు గెలవాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా హర్మన్‌ప్రీత్ సేనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

అత్యుత్తమ జట్టే గెలుస్తుంది:

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మోరిసన్‌ ట్వీట్‌కు బదులిస్తూ నరేంద్ర మోడీ ఓ ట్వీట్‌ చేశారు. 'ఆదివారం జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ భారత్-ఆసీస్‌ మ్యాచ్‌ కంటే మరో పెద్ద విషయం ఏదీ లేదు. ఇరు జట్లు బాగా ఆడాలని కోరుకుంటున్నా. అత్యుత్తమ జట్టే విజయం సాధిస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేశారు.

ఉత్తమ జట్లు తలపడనున్నాయి:

ఉత్తమ జట్లు తలపడనున్నాయి:

అంతకుమందు ఆసీస్‌ ప్రధాని మోడీని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. 'నరేంద్ర మోడీ.. మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌, ఆసీస్ జట్లు ఆడనున్నాయి. ఎంతో మంది ప్రేక్షకుల మధ్య రెండు ఉత్తమ జట్లు తలపడనున్నాయి. ఇది గొప్ప రోజుగా, మంచి మ్యాచ్‌గా నిలుస్తుంది. ఆసీస్ జట్టు తన మార్గంలో దూసుకెళ్తోంది' అని రాసుకొచ్చారు. భారత్‌పై తమ జట్టు విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హర్మన్‌సేన భయాన్ని ముందు గెలవాలి:

హర్మన్‌సేన భయాన్ని ముందు గెలవాలి:

లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయం. అయితే ఫైనల్లో ఆసీస్‌ను చిత్తుచేయడం అంత సులువు కాదు. గత ఐదు సీజన్లలో వరుసగా ఫైనల్‌కు చేరి నాలుగు ట్రోఫీలను గెలిచిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిందే. భారత్ సమిష్టిగా రాణిస్తేనే కప్ దక్కుతుందనేది వాస్తవం. అయితే కంగారూలను గెలిచే ముందే హర్మన్‌సేన భయాన్ని ముందు గెలవాలి.

Story first published: Saturday, March 7, 2020, 23:54 [IST]
Other articles published on Mar 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+