RSWS 2022: నమన్ ఓజా.. ఫైనల్లో సెంచరీతో బ్యాట్ బాజా..! రెండో సారి విజేతగా ఇండియా లెజెండ్స్..!

సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌కు వరుసగా రెండోసారి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టైటిల్‌ను అందుకుంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను మట్టికరిపించిన ఇండియా లెజెండ్స్.. ఈ టోర్నీలో అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ 6వికెట్లు కోల్పోయి 195పరుగుల భారీ స్కోరు చేయగా.. తర్వాత ఛేదనలో శ్రీలంక లెజెండ్స్ 162పరుగులకే పరిమితమైంది. తద్వారా 33పరుగుల తేడాతో ఇండియా విజయాన్ని అందుకుంది. ఇకపోతే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ప్రారంభ ఎడిషన్ ఫైనల్‌లో కూడా ఇదే వేదికపై జరిగిన ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను ఓడించి ట్రోఫీ ముద్దాడిన సంగతి తెలిసిందే.
సచిన్ ఫస్ట్ బాల్‌కే డకౌట్..
రాయ్‌పూర్‌లో మంచు ప్రభావం సాయంత్రం బాగా కన్పించింది. దీంతో ఈ మ్యాచ్ టాస్ గెలిచిన సచిన్ టెండూల్కర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర బౌలింగ్లో తొలి బంతికే సచిన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో స్టేడియంలో అభిమానులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. తర్వాత సురేశ్ రైనా (4)కు కూడా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో 3ఓవర్లు ముగిసేసరికి 19పరుగులకే భారత్ 2కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓజా - వినయ్ భారీ భాగస్వామ్యం
అయితే వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన నమన్ ఓజా ఫైనల్లో సెంచరీతో అదరగొట్టాడు. (71బంతుల్లో 108పరుగులు 15ఫోర్లు, 2 సిక్సర్లు నాటౌట్) కడవరకు క్రీజులో ఉండి భారీ స్కోరుకు బాటలు వేశాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అయిన వినయ్ కుమార్‌తో కలిసి ఓజా 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్‌ల కంటే ముందు 4వ స్థానంలో వినయ్ కుమార్ బరిలోకి దిగడం కాస్త విచిత్రం అనిపించింది. అయితే ఆ ప్రయోగం సక్సెస్ అయింది. మంచి భాగస్వామ్యంలో నమన్ ఓజాకు వినయ్ కుమార్ సూపర్బ్ సహకారం అందించాడు. అతను (21 బంతుల్లో 35పరుగులు) ఆకట్టుకున్నాడు.
కాసేపు దడదడలాడించిన జయరత్నే
ఇక చివర్లో యువరాజ్ (19), ఇర్ఫాన్ (11)లు పర్వాలేదనిపించేలా ఆడడంతో భారత్ భారీ స్కోరుకు చేరుకుంది. ఆ తర్వాత ఛేదనకు దిగిన శ్రీలంకకు పెద్దగా మంచి ఆరంభం దక్కలేదు. ఇషాన్ జయరత్నే (22బంతుల్లో 51పరుగులు 4ఫోర్లు, 4సిక్సర్లు) కాసేపు దడదడలాడించాడు. అయితే అతను ఔటయ్యాక లంక ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. మిగతావాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక భారత బౌలర్లలో అభిమన్యు మిథున్ 2, వినయ్ కుమార్ 3, స్టువర్ట్ బిన్నీ, రాజేశ్ పవర్, రాహుల్ శర్మ, యూసుప్ పఠాన్ తలా ఓ వికెట్ తీసి ఆకట్టుకున్నారు. ఇక ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ గా నమాన్ ఓజా నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా దిల్షాన్ నిలాచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications