For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2024: నమీబియా-ఒమన్ మ్యాచ్ టై.. సూపర్ ఓవర్!

టీ20 వరల్డ్ కప్-2024లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. బార్బడోస్ వేదికగా నమీబియా-ఒమన్ మధ్య జరుగుతున్న మ్యాచ్ టైగా ముగిసింది. స్వల్ప స్కోరు నమోదైన ఈ మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో నమీబియా ఒక్క పరుగే సాధించడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఖలీద్ కైల్ (34; 39 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ట్రంపెల్మన్ (4/21) నాలుగు వికెట్లు, వైసే (3/28) మూడు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో నమీబియా 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. జేన్ ఫ్రైలింక్ (45; 48 బంతుల్లో, 6 ఫోర్లు) పోరాడాడు. ఒమన్ బౌలర్ మెహ్రన్ ఖాన్ (3/7) మూడు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

NAM vs OMAN T20 World Cup 2024 Namibia and Oman Match Tied Heads to Super Over

ఛేదనలో నమీబియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే ఖాతా తెరవకముందు ఓపెనర్ మైకేల్ డకౌటయ్యాడు. మరో ఓపెనర్ నికోలాస్ (24; 31 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి జేన్ ఫ్రైలింక్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత సేపు నమీబియా ఫేవరేటులో ఉంది. కానీ మెహ్రన్ ఖాన్ బంతి అందుకోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. నమీబియా వరుసగా వికెట్లు కోల్పోయింది.

ఆఖరి ఓవర్‌లో అయిదు పరుగులు అవసరమవ్వగా మెహ్రన్ రెండు వికెట్లు తీసి నాలుగు పరుగులు ఇచ్చాడు. తొలి బంతికి ఫ్రైలింక్‌ను బౌల్డ్ చేశాడు. మూడో బంతికి జేన్ గ్రీన్‌ను ఔట్ చేయడంతో తొలి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా రాలేదు. అయితే నాలుగో బంతికి సింగిల్, అయిదో బంతికి రెండు పరుగులు రావడంతో నమీబియా విజయ సమీకరణం చివరి బంతికి రెండు పరుగులుగా మారింది. మెహ్రన్ వేసిన బంతిని డేవిడ్ వైసే బ్యాటుకు తాకించలేకపోయాడు. వికెట్ కీపర్ నసీమ్ స్టంప్స్ వెనకే ఉన్నప్పటికీ రనౌట్ చేయలేకపోయాడు.

అంతకుముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఒమన్‌కు శుభారంభమే దక్కలేదు. ఖాతా తెరవకముందే రెండు వికెట్లు కోల్పోయింది. ట్రంపెల్మన్ మొదటి ఓవర్‌లో తొలి రెండు బంతులకే కశ్యప్, కెప్టెన్ అకిబ్ ఇలియాస్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. కాసేపటికే మరో ఓపెనర్ నసీమ్ ఖుషి (6; 6 బంతుల్లో, 1 ఫోర్)ను కూడా ఔట్ చేశాడు. దీంతో ఒమన్ 10 పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జీషన్ మక్సూద్ (22; 20 బంతుల్లో, 4 ఫోర్లు)తో కలిసి ఖలీద్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. అయితే నమీబియా బౌలర్లు పుంజుకోవడంతో ఒమన్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. సహచరులు వెనుదిరుగుతున్న ఖలీద్ స్కోరుబోర్డును నెమ్మదిగా ముందుకు నడిపాడు. ఒమన్ బ్యాటర్లలో నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు.

Story first published: Monday, June 3, 2024, 9:36 [IST]
Other articles published on Jun 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+