BAN VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ - 'మా ఓటమికి కారణమిదే'
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై న్యూజిలాండ్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో న్యూజిలాండ్ నాకౌట్ కు దూసుకెళ్లగా.. బంగ్లా టోర్ని నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ జట్టు ఓటమికి గల కారణాలను మాట్లాడాడు బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో. నెక్స్ట్ పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ తమకు ముఖ్యమని పేర్కొన్నాడు.
ఆ మ్యాచ్ మాకు ముఖ్యం..
"మేం అద్భుతంగా మొదలుపెట్టాం. అయితే మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు కోల్పోయాం. బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. బ్యాటింగ్ చేయడానికి ఇది మంచి వికెట్. మాకు రెండు పెద్ద భాగస్వామ్యాలు అవసరమయ్యాయి. ఇక నహీద్ అద్భుతం. అతడి బౌలింగ్ చేసిన విధానంతో సంతృప్తిగా ఉన్నాను. గత రెండేళ్లుగా మా బౌలింగ్ మంచిగా రాణిస్తోంది. నాకు తెలిసి ఇక పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. భారీ తేడాతో ఆ జట్టును ఓడించాలి. మేం బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి." అని నజ్ముల్ శాంటో పేర్కొన్నాడు.

సవాల్ విసురుతుందని తెలుసు..
మ్యాచ్ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ.. "ఈ పిచ్ కండిషన్స్ పై బంగ్లాదేశ్ సవాల్ విసురుతుందని మాకు తెలుసు. అయితే బ్రేస్ వెల్ క్వాలిటీ బౌలర్. అతడు తన పేస్ ను మార్చుకున్నాడు. మిడిల్ ఓవర్లలో అతడు వికెట్లు తీసిన విధానం ఎంతో కీలకం. నేను అనుకున్న దాని కన్నా వికెట్ బాగా వేగంతో ఉంది. మంచు కురిసింది కానీ నేను అనుకున్నంత లేదు. ఇక రచిన్ రవీంద్ర ఐసీసీ ఈవెంట్ లను బాగా ఇష్టపడతాడు. అతడు ఎప్పటికీ ఆటను విడిచిపెట్టడు. టామ్ తో మంచి భాగస్వామ్యం ఏర్పడింది." అని చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. బ్యాటుతో రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 12×4, 1×6 సాయంతో 112).. బంతితో బ్రాస్‌వెల్ (4/26) అద్భుతంగా రాణించారు. దీంతో 237 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
The first two semi-finalists of #ChampionsTrophy 2025 🏆
— ICC (@ICC) February 24, 2025
Details: https://t.co/EVdyKNzUp2 pic.twitter.com/F9zyoGhOXL
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications