నదీమ్‌కు 10 వికెట్లు.. విజయం దిశగా భారత్

ఆంటిగ్వా: వెస్టిండీస్-ఏతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత్-ఏ స్పిన్నర్ షహ్‌బాజ్ నదీమ్ 10 వికెట్లతో చెలరేగడంతో.. భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఎ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 10.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజులో అభిమన్యు ఈశ్వరన్ (23) ఉన్నాడు. నాలుగో రోజు (మ్యాచ్ చివరి రోజు) భారత్ మరో 68 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 120 వద్ద శనివారం ఆట మొదలుపెట్టిన వెస్టిండీస్-ఎ 77 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. 159 పరుగుల వరకూ బాగానే ఆడిన విండీస్.. ఆపై స్పిన్నర్ నదీమ్ స్పిన్‌కు విలవిల్లాడింది. నదీమ్ 5 వికెట్లు పడగొట్టాడు. 21 ఓవర్లు బౌలింగ్ చేసిన నదీమ్.. ఏడు ఓవర్లు మెయిడిన్ చేసి 47 పరుగులు ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌మూడు వికెట్లతో చెలరేగడంతో విండీస్ 21 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయింది.
విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసి భారత్‌కు 97 పరుగుల లక్ష్యంను నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 312 పరుగులకు, వెస్టిండీస్ 228 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. తొలి ఇన్నింగ్‌లోనూ నదీమ్ ఐదు వికెట్లు తీసాడు. దీంతో ఈ మ్యాచ్‌లో 109 పరుగులిచ్చి పది వికెట్లు తీసాడు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ రెండు వికెట్లు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications