శ్రీని అడ్డుకోకుంటే.. కోహ్లీ ఎప్పుడో కెప్టెన్: రాజా
కోల్‌కతా: ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2012లోనే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేవాడని, అయితే తమ నిర్ణయాన్ని నాటి బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తిరస్కరించాడని మాజీ సెలెక్టర్ రాజా వెంకట్ పేర్కొన్నాడు.
అంతేకాదు, 2011 చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు శ్రీనివాసన్ కారణంగా అనేక గ్రూపులుగా విడిపోయిందని తెలిపాడు.

'ఓ సేనానిలా ముందు నిలబడి జట్టుకు మార్గదర్శనంలో చేయడంలో కోహ్లీ ఆదర్శంగా నిలుస్తాడు. ఓ నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో.. కోహ్లీలో అవన్నీ పుష్కలంగా ఉన్నాయి'ని కోహ్లీని రాజా ప్రశంసించాడు.
'మొత్తానికి కోహ్లీ కెప్టెన్ అయినందుకు సంతోషంగా ఉంది. అతను ఈ బాధ్యతలు 2012లోనే చేపట్టేవాడు. శ్రీనివాసన్ కారణంగా ఆలస్యమైంది. 2011 ఆస్ట్రేలియా పర్యటనలోనైతే భారత్ ఘోరంగా విఫలమవడానికి కారణం జట్టులో టీమ్ స్పిరిట్ లోపించడమే. ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయారు. దానికి కారణం శ్రీనివాసనే' అని ఓ పత్రికకు రాసిన కథనంలో వెంకట్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications