
సొంత కొడుకు లాగా చూసుకున్నా:
ఈ వ్యాఖ్యలపై శ్రీనివాసన్ స్పందిస్తూ... సురేష్ రైనా చెప్పింది నిజమేనని, అతనిని తన సొంత కొడుకు లాగా చూసుకున్నట్లు తెలిపారు. 'రైనాను సొంత కొడుకు లాగా చూసుకున్నా. జట్టు విజయాల కోసం ఎంతో శ్రమించాడు. సీఎస్‌కే విజయాలకు ప్రధాన కారణం ఆటగాళ్ల వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే. నేను ఎప్పుడూ అలానే ఉంటాను. గత నలబై సంవత్సరాలుగా ఇండియా సిమెంట్స్.. క్రికెట్ ఫ్రాంచైజీలతో సంబంధం ఉంది' అని అన్నారు.

అవన్నీ కెప్టెన్ చూసుకుంటాడు:
ఐపీఎల్‌లో సురేష్ రైనా ఆడాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్రకు శ్రీనివాసన్ స్పందిస్తూ... తాము టీమ్‌ను మాత్రమే ఫ్రాంచైజీగా (కొనుగోలు) తీసుకున్నామని, ఆటగాళ్లను కాదన్నారు. 'నేను చెన్నై జట్టుకు కెప్టెన్‌ను కాదు. ఎవరిని మ్యాచులో ఆడించాలో, ఎవరిని వేలంలో తీసుకోవాలో అని టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్‌కు ఎప్పుడూ చెప్పలేదు. సీఎస్‌కేకు అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కెప్టెన్ అన్ని చూసుకుంటాడు' అని శ్రీనివాసన్ చెప్పారు. మొత్తానికి రైనా మళ్లీ ఐపీఎల్ 2020 ఆడడం ఎంఎస్ ధోనీ చేతుల్లోనే ఉందని చెప్పకనే చెప్పారు.

చిన్న కొడుకులా చూసుకుంటారు:
'కుటుంబం కోసమే తిరిగి రావాలని నిర్ణయించుకున్నా. నేను దగ్గరుండి చూసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. సీఎస్‌కే కూడా నా కుటుంబమే. మహీ భాయ్ నాకెంతో ముఖ్యమైన వ్యక్తి. ఈ నిర్ణయం చాలా కఠినమైందే. సీఎస్‌కే, నాకూ మధ్య ఎలాంటి వివాదం లేదు. గట్టి కారణం లేకుండా ఎవరూ రూ.12.5 కోట్లు వదులుకోరు. అంతర్జాతీయ క్రికెట్‌కు నేను వీడ్కోలు పలికి ఉండొచ్చు. కానీ నాకింకా వయసుంది. శ్రీనివాసన్ నాకు తండ్రిలాంటి వారు. నాకెప్పుడూ అండగానే ఉన్నారు. ఆయన నా హృదయానికి ఎంతో దగ్గర. నన్నాయన చిన్న కొడుకులా చూసుకుంటారు. ఆయన వ్యాఖ్యలన్ని మరో కోణంలోనే చూశారని కచ్చితంగా నాకు తెలుసు. తండ్రి తన కొడుకును మందలించకుండా ఉంటారా?' అని సురేష్ రైనా తాజాగా పేర్కొన్నాడు.

సాధన చేస్తున్నా:
ప్రస్తుతం భారత్‌లో తాను క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ సాధన చేస్తున్నానని సురేష్ రైనా తెలిపాడు. మళ్లీ దుబాయ్‌లో తనను చూసిన ఆశ్చర్యం లేదని అంటున్నాడు. ఐపీఎల్ 2020ని సురక్షితంగా, విజయవంతంగా నిర్వహించేందుకు.. బీసీసీఐ, జట్టు యాజమాన్యాలు ఎంతో కృషి చేస్తున్నాయన్నాడు. క్వారంటైన్‌లో ఆటగాళ్లు గదుల్లోంచి బయటకు రాలేదని రెండు రోజులకోసారి పరీక్షలు చేయించుకున్నామని వివరించాడు.
Mumbai Indians: ముంబైకి భారీ షాక్.. ఐపీఎల్ 2020 నుంచి స్టార్ పేసర్ ఔట్!!


Click it and Unblock the Notifications












