For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీకి ఐకాన్ హోదా లేదు కానీ స్టార్‌ హోదా ఉంది.. అందుకే ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి'

N Srinivasan reveals how CSK bagged MS Dhoni in 2008 IPL auction

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2008లో ప్రారంభం అయింది. ఏ భారతీయ ఆటగాడు ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తాడో అని అభిమానుల్లో ఎంతో కుతూహలం ఉండేది. ఒక్కో ఫ్రాంచైజీకి స్థానిక ఆటగాడు ఐకాన్ ప్లేయర్‌గా ఉన్నారు. 'ఐకాన్ ప్లేయర్'కు ఆ నగర అభిమానులతో ప్రత్యక్ష అనుబంధం ఉండేది. భారత జట్టులో స్టార్‌ ఆటగాళ్లుగా ఉన్న సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌లను ఐకానిక్‌ ఆటగాళ్లుగా గుర్తించారు. వారు ఆయా జట్లకు సారథిగా ఎంపికయ్యారు.

రాంచీ నుంచి ఏ ఫ్రాంచైజీ లేదు:

రాంచీ నుంచి ఏ ఫ్రాంచైజీ లేదు:

అప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీకి ఐకానిక్‌ హోదా లేదు. ఎందుకంటే.. మహీ పుట్టిపెరిగిన రాంచీ నుంచి ఏ ఫ్రాంచైజీ లేదు. దీంతో అతను వేలంలోకి వచ్చాడు. అప్పటికే 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలిచి మహీ రికార్డు సృష్టించాడు. కుర్రాళ్లతో దక్షిణాఫ్రికా వెళ్లి కప్ కొట్టాడు. సీనియర్లు, జూనియర్లను సమన్వయం చేసి జట్టును అద్భుతంగా నడిపించాడు. తెలివైన నిర్ణయాలతో ఎన్నో మ్యాచులను గట్టెకెక్కించాడు. దీంతో వేలంలో ధోనీ కోసం అన్ని ఫ్రాంచైజీలు గట్టిగానే ప్రయత్నించగా.. చివరకు చెన్నై సూపర్ ‌కింగ్స్‌ దక్కించుకొంది. అయితే చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాసన్‌.. ధోనీని వేలంలో ఎలా దక్కించుకున్న విషయాన్ని తాజాగా చెప్పాడు.

సొంత జట్టుకే ఐకానిక్‌ ప్లేయర్స్:

సొంత జట్టుకే ఐకానిక్‌ ప్లేయర్స్:

పీటీఐ ఇంటర్య్వూలో ఎన్‌ శ్రీనివాసన్ మాట్లాడుతూ... 'మొదటి ఐపీఎల్‌ సీజన్‌ వేలం జరుగుతోంది. ఆయా ఫ్రాంచైజీలు ఐకానిక్‌ హోదా ఉన్న ఆటగాళ్లు సొంత జట్టుకే ఆడాలని తీర్మానం చేశాయి. దీంతో సచిన్ ‌( ముంబై ఇండియన్స్‌), గంగూలీ (కోల్‌కతా నైట్‌రైడర్స్‌), ద్రవిడ్ ‌(రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు), యువరాజ్ ‌(కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌), సెహ్వాగ్‌ (ఢిల్లీ డేర్‌డేవిల్స్‌) జట్లకు సారథులుగా ఎంపికయ్యారు. ఐకానిక్‌ హోదాలో వీరికి అందరికంటే ఎక్కువ మొత్తం లభిస్తుంది' అని తెలిపారు.

వేలంలో ఎంతోదూరం వెళ్లా:

వేలంలో ఎంతోదూరం వెళ్లా:

'ఎంఎస్ ధోనీకి ఐకానిక్‌ హోదా లేదు. ఎందుకంటే రాంచీ నుంచి ఏ ఫ్రాంచైజీ లేదు. దీంతో అతను వేలంలోకి వచ్చాడు. ధోనీకి ఐకానిక్‌ హోదా లేదు కానీ స్టార్‌ హోదా ఉంది. అందుకే అతని కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దీంతో మహీ రేటు పెరిగిపోయింది. ఎలాగైనా మహీని దక్కించుకోవాలనే తపనతో వేలంలో ఎంతోదూరం వెళ్లా. చివరకు చైన్నైకి మహీని తీసుకొచ్చి కెప్టెన్‌ను చేశా. ఆ సమయంలో నేను ఒక్కేటే అనుకున్నా.. "మాకు ఐకానిక్‌ ఆటగాడు అవసరం లేదు. జట్టును స్థిరంగా నడిపించే నాయకుడు చాలు" అని. అందుకే ధోనీని చేనై ఫ్రాంచైజీలోకి తీసుకొని కెప్టెన్‌ను చేశాం. ధోనీ ఎంపిక లెక్కలకు అందని సూత్రం' అని శ్రీనివాసన్ పేర్కొన్నారు.

విజయవంతమైన జట్టుగా రికార్డు:

విజయవంతమైన జట్టుగా రికార్డు:

ఎంఎస్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌ చరిత్రలో విజయవంతమైన జట్టుగా పేరుపొందింది. ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ సాధించింది. గతేడాది తృటిలో చేజారింది. ఇక చెన్నై రెండు సార్లు చాంపియన్‌ లీగ్స్‌ను కూడా గెలిచింది. అంతేకాదు ఐపీఎల్‌ సీజన్లలో 8సార్లు ఫైనల్‌ చేరిన జట్టుగా, ఎక్కువసార్లు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఐపీఎల్‌ యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు జరుగనుంది.

Story first published: Friday, August 21, 2020, 13:47 [IST]
Other articles published on Aug 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+