రాజ్‌కుంద్రాతో సహా నలుగురు: శ్రీ ఫిక్సింగ్‌లో లేడు కానీ
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై ముద్గల్ కమిటీ నివేదిక బహిర్గతమైంది. నివేదిక శ్రీనివాసన్‌కు ఊరట కలిగించేదే అయినప్పటికీ.. అతడి పైన ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌తో శ్రీనివాసన్‌కు సంబంధం లేదని తేల్చిన కమిటీ. అవినీతి వ్యవహారాల గురించి తెలిసినా అతడు చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది.
శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మీయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా చట్ట వ్యతిరేకమైన బెట్టింగుకు పాల్పడ్డట్లు పేర్కొంది. ఐపీఎల్ సీఓఓ రామన్‌కు బుకీలతో సంబంధాలు ఉన్నట్లు తేల్చింది. అయితే, బిసీసీఐ అధ్యక్ష స్థానానికి మరోసారి పోటీపడేందుకు సిద్ధమవుతున్న ఐసీసీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు మాత్రం ఇది కొంతలోకొంత ఊరట.
అలాగే, విచారణకు అతను ఆటంకం కలిగించలేదని పేర్కొందని అంటూ నివేదికలోని కొన్ని అంశాలను బయటపెట్టింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన బోర్డు కీలక వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)పై నిర్ణయాన్ని తీసుకోవడానికి మంగళవారం పాలక మండలి సమావేశం కానున్న నేపథ్యంలో ఫిక్సింగ్ కేసులో శ్రీని పాత్ర లేదని ముద్గల్ కమిటీలో ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు ప్రకటించడం విశేషం.
దీనితో మరోసారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ఇప్పటి వరకూ శ్రీనివాసన్‌కి ఉన్న ప్రధాన ఆటంకం తొలగిపోయింది.
గత ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగుతున్నప్పుడు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయడంతో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అనేక పలుపులు తిరిగిన తర్వాత ఈ కేసులో ఎంతో మంది పేర్లు చేరాయి.

శ్రీనివాసన్
మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇతడి పాత్ర లేదు. ఫిక్సింగ్ పైన విచారణను అడ్డుకోవడానికి కూడా ఇతడు ప్రయత్నించలేదు. కానీ ఇతడికి, నరో నలుగురికి ఒకరి అవినీతి వ్యవహారాల గురించి తెలుసు. కానీ చర్యలు తీసుకోలేదు.

గురునాథ్ మీయప్పన్
గురునాథ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు చూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఇతడు చెన్నై జట్టు అధికారేనని, చట్ట వ్యతిరేకమైన బెట్టింగుకు పాల్పడ్డాడని విచారణలో తేలింది.

సుందర రామన్
బుకీ తెలుసునని ఒప్పుకున్నాడు. ఒక సీజన్‌లో వారితో 8సార్లు మాట్లాడాడు. కానీ ఆ వ్యక్తి బెట్టింగు కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తనకు తెలియదన్నాడు. మయప్పన్, రాజ్ కుంద్రా బెట్టింగుకు పాల్పడుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందని అంగీకరించాడు. కానీ అది చర్యలు తీసుకోదగ్గ సమాచారం కాదని ఐసీసీ అవినీతి నిరోదక బృందం అధినేత చెప్పాడు. సమాచారం తన వద్దే ఉంచుకున్నానని, ఎవరికీ చెప్పలేదని కూడా తెలిపాడు.

రాజ్ కుంద్రా
బెట్టింగ్ కోసం బుకీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. బుకీలతో తన పరిచయం గురించి వెల్లడించకపోవడం ద్వారా నియమావళి ఉల్లంఘించాడు. ఇతడి పైన విచారణ అర్ధంతరంగా ఆగిపోయింది. ఎలాంటి కారణాలు లేకుండా రాజస్థాన్ పోలీసులు విచారణ ఆపారు. ఇతడి స్నేహితుడు పెద్ద పందెరాయుడు. ఇతడి తరఫున బెట్టింగుకు పాల్పడ్డట్లు కమిటి ముందు అంగీకరించాడు. ఇతటు బెట్టింగ్ చేశాడు లేదా బెట్టింగ్ చేసే మిత్రుడికి హామీగా ఉన్నాడనేందుకు ఆధారాలున్నాయి.
వారిలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన గురునాథ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రా తదితరులు కూడా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని శ్రీనివాసన్ జయమానికి ఉన్న ఇండియన్ సిమెంట్స్ కొనడం, మెయ్యప్పన్ అతనికి స్వయానా అల్లుడు కావడంతో ఈ కేసు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫిక్సింగ్ కేసు శ్రీనివాసన్ మెడకు కూడా చుట్టుకుంది.
మరోవైపు బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ ఈ కేసుతో సంబంధం ఉన్నవారిపై, ప్రత్యేకించి శ్రీనివాసన్ పైన యుద్ధాన్ని ప్రకటించాడు. శ్రీనివాసన్‌ని బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ తొలుత ముంబై హైకోర్టును, తర్వాత తలెత్తిన పరిణామాల నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. బోర్డు అధ్యక్షుడి, ఐసిసి చైర్మన్‌గా పోటీ చేయకుండా అతనిని అడ్టుకోవాలని సుప్రీం కోర్టును వర్మ కోరాడు. కానీ, పోటీ చేసే విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.
అయితే, విచారణ పూర్తయ్యే వరకూ బోర్డు వ్యవహారాల నుంచి దూరంగా ఉండాల్సిందిగా శ్రీనివాసన్‌ని ఆదేశించింది. కేసు విచారణను రెండు దఫాలుగా ముకుల్ ముద్గల్ కమిటీకి అప్పగించింది. కమిటీ తుది నివేదికను పరిశీలిస్తున్న సుప్రీం కేసును 24వ తేదీకి వాయిదా వేసింది. అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు శ్రీనికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో బోర్డు కూడా ఈ నెల 20న జరగాల్సిన ఎజిఎంను నిరవధికంగా వాయిదా వేసింది.
తాజా పరిణామాలపై చర్చించేందుకు మంగళవారం సమావేశం కావాలని బోర్డు పాలక మండలి నిర్ణయించింది. ఈలోగా ముద్గల్ కమిటీ సమర్పించిన నివేదికలోని కొన్ని అంశాలను సుప్రీం కోర్టు సోమవారం విడుదల చేసింది. శ్రీనివాసన్ సహా 13 మంది పేర్లు నివేదికలో ఉన్నట్టు ఇంతకు ముందే ప్రకటించిన కోర్టు తాజాగా అతనికి కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని వెల్లడించింది.
కమిటీ క్లీన్ చిట్ ఇవ్వడంతో సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పులోనూ అతనిని నిర్దోషిగా పేర్కొనే అవకాశం ఉంది. బోర్డు అధ్యక్ష స్థానంలో కూర్చోవాలన్న పట్టుదలతో ఉన్న శ్రీనికి ఇది ఊరటనిస్తోంది. తిరిగి పోటీ చేసేందుకు ఉన్న ప్రధాన అడ్డంకి దాదాపుగా తొలగిపోయింది. సుప్రీం తన తుది తీర్పులో దోషిగా పేర్కొంటే తప్ప అతను బోర్డు అధ్యక్షుడిగా పోటీ చేయడం ఖాయం. ఇప్పటికే ఎన్నికయ్యేందుకు అవసరమైన మద్దతును కూడగట్టుకున్న అతనికి బిసిసిఐ అధ్యక్ష పదవి దక్కడం కష్టం కాకపోవచ్చు.
ఎవరి గురించి ఏం చెప్పింది...
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications