Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'బ్యాట్స్‌మెన్‌ను తిప్పలు పెట్టేందుకు యార్కర్లు సిద్ధం'

ICC Cricket World Cup 2019 : Mohammed Shami Says 'My Yorkers Ready To Rock The World Cup | Oneindia
My yorkers ready to rock World Cup: Mohammed Shami

హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న బౌలింగ్ జట్టులో భాగంగా ఉండటం ఎంతో గర్వంగా ఉందని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ చెప్పాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షమీ మాట్లాడతూ "ప్రస్తుత బౌలింగ్ జట్టులో ఉండటం చాలా గర్వంగా ఉంది. ప్రతిభ, పేస్ ఈ జట్టుకి ప్రధాన బలాలు, అవి మాకు ఎంతో నమ్మకాన్ని ఇస్తాయి" అని చెప్పాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

"నిజం చెప్పాలంటే నా కల నెరవేరినట్లు ఉంది. ఇంగ్లాండ్‌లో ఫ్లాట్‌ పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం. బౌలర్లు తెలివిగా బౌలింగ్‌ చేస్తే బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయొచ్చు. పరిస్థితులను బట్టి బౌలింగ్‌ చేయాల్సిన బాధ్యత బౌలర్లదే. భారీ స్కోరు గురించి నేనేమీ ఆలోచించట్లేదు. వైట్ బాల్ క్రికెట్ నాకు మంచి రికార్డు ఉంది. ఈ అవకాశం కోసం రెండు సంవత్సరాలు ఎదురుచూశాను" అని షమీ తెలిపాడు.

"ప్రపంచకప్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పలు పెట్టేందుకు నా దగ్గర యార్కర్లు సిద్ధంగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారత జట్టు సాధించిన విజయాల్లో బౌలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు ఇండియా అంటే బ్యాట్స్‌మెన్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అయితే, ఈ మార్పు రాత్రికిరాత్రి జరిగింది కాదు. భారత జట్టులో బౌలింగ్‌ గురించి విదేశీ క్రికెటర్లు సైతం మాట్లాడుకోవడం గర్వంగా ఉంది" అని షమీ పేర్కొన్నాడు.

ఇటీవలి కాలంలో షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లోనూ పంజాబ్‌ తరఫున షమీ మంచి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. విదేశాల్లో జరిగిన వన్డే సిరీస్‌లలో అద్భుతంగా రాణించి.. వరల్డ్‌కప్ జట్టులో సైతం చోటు దక్కించుకున్నాడు. 2013లో టెస్టు మ్యాచ్‌ ద్వారా భారత జట్టులో అటుగుపెట్టిన షమీ ఇప్పటి వరకూ 40 టెస్టుల్లో 144 వికెట్లు, 63 వన్డేల్లో 113 వికెట్లు తీశాడు.

Story first published: Sunday, May 19, 2019, 17:22 [IST]
Other articles published on May 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+