For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాపీ యత్నం: ఏబీ ఫ్యాన్స్ లిస్ట్‌లో ద్రావిడ్ తనయులు

By Srinivas

బెంగళూరు: దక్షిణాఫ్రికా బ్యాట్సుమెన్ ఏబీ డివిల్లీయర్స్‌కు భారత్‌లో చాలామంది అభిమానులు ఉన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. బెంగళూరు అభిమానులు 'ఏబీ.. ఏబీ' అంటూ కేరింతలు కొట్టడం డివిల్లీయర్స్ అభిమానులు కూడా స్వయంగా చూసి ఆశ్చర్యపోయారు.

భారత్‌లో క్రికెట్‌ను ప్రేమించే యువతలో చాలామంది డివిల్లీయర్స్‌ను ఇష్టపడతారు. భారత్‌లో డివిల్లీయర్స్‌ను ఇష్టపడేవారి జాబితాలో మాజీ టెస్ట్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ తనయులు కూడా చేరిపోయాడు. ఈ విషయాన్ని ద్రావిడ్ చెప్పారు.

ద్రావిడ్ ఇండియా 'ఏ', అండర్ 19 జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ద్రావిడ్ మాట్లాడుతూ.. తన కొడుకులు సమిత్, అన్వయ్ ఇద్దరు కూడా డివిల్లీయర్స్‌ను కాపీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టెస్టుల్లో ద్రావిడ్ గొప్ప బ్యాట్సుమెన్. అలాంటి ద్రావిడ్ కొడుకులు.. దక్షిణాఫ్రికా బ్యాట్సుమెన్‌లా ఆడాలనుకోవడం గమనార్హం.

 My sons try to copy AB de Villiers, reveals Rahul Dravid

అలా (డివిల్లీయర్స్)లా ఆడితో పేరు తెచ్చుకోవచ్చునని, నేను నా కొడుకులు ఆడుతుంటే చూస్తున్నానని, వారు ఎప్పుడు డివిల్లీయర్స్‌లా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిలాగే యువ ఆటగాళ్లు అందరూ అలాగే చేస్తున్నారని, కానీ అది అంత సులభం కాదని వారికి అర్థమవుతుందని ద్రావిడ్ అన్నారు.

కాగా, ద్రావిడ్ పెద్ద కొడుకు సమిత్.. ఇప్పటికే స్కూల్ క్రికెట్ టోర్నమెంటుల్లో ఆడుతున్నాడు. తొమ్మిదేళ్ల వయస్సు గల ఇతడు రైట్ హ్యాండెడ్ బ్యాట్సుమెన్. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో బెంగళూరు ఇంటర స్కూల్ టోర్నమెంటులో బెస్ట్ బ్యాట్సుమెన్ అవార్డును గెలుచుకున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+