Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనితో తన కుమారుడి ఫోటో వైరల్‌: పాక్ కెప్టెన్ వివరణ

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి జూన్ 18 (ఆదివారం) ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని... పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కుమారుడు అబ్దుల్లాని ఎత్తుకున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా పాక్‌ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని తన కుమారుడిని ఎత్తుకుని దిగిన ఫొటో గురించి వివరించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ కోసం నిర్వాహకులు భారత్, పాకిస్థాన్ జట్ల ఆటగాళ్లకి ఒకే హోటల్‌లో బస ఏర్పాటు చేశారు.

అబ్దుల్లాతో ఫొటో దిగాలని కోరగా ధోనిని కోరా

అబ్దుల్లాతో ఫొటో దిగాలని కోరగా ధోనిని కోరా

ఒక రోజు కుటుంబసభ్యులతో కలిసి లాబీలో కూర్చుని ఉండగా ధోని అటుగా వెళ్లడాన్ని గమనించాను. వెంటనే అతడి వద్దకి వెళ్లి తనతో పాటు, తన కుమారుడు అబ్దుల్లాతో ఫొటో దిగాలని కోరగా ధోని వెంటనే ఒప్పుకోవడంతో సరదాగా కాసేపు ఫొటోలు దిగి సందడి చేసినట్లు సర్ఫరాజ్‌ తెలిపాడు.

జ్ఞాపకాలను చూసేందుకే

ధోనితో ఫోటో దిగిన జ్ఞాపకాన్నిచాలా భద్రంగా దాచినట్లు తెలిపాడు. అబ్దుల్లా పెద్ద వాడైన తర్వాత.. తన తండ్రి సాధించిన విజయాలకు సంబంధించిన జ్ఞాపకాలను చూసేందుకు ఇలా ఫొటోలు తీసి భద్రపరుస్తున్నట్లు సర్ఫరాజ్‌ చెప్పాడు.

పాక్ చేతిలో భారత్ ఘోర ఓటమి

పాక్ చేతిలో భారత్ ఘోర ఓటమి

ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో టీమిండియా కనీసం పోరాడకుండా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. అనంతరం 339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది.

చరిత్ర సృష్టించిన పాకిస్థాన్

దీంతో భారత్‌పై 180 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించి తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. పాకిస్థాన్ ఓపెనల్ అజార్‌ అలీ భారత క్రికెటర్లకు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. తమ విలువైన సమయాన్ని తన కుమారులతో గడిపినందుకు క్రికెట్‌ దిగ్గజాలు మహేంద్ర సింగ్‌ ధోనీ, యువరాజ్‌ సింగ్‌, విరాట్‌ కోహ్లీకి ధన్యవాదాలు అని ట్విటర్‌లో అలీ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+