For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జ్వాలా గుత్తాకు పద్ధతి లేదు: సోదరి బహిరంగ లేఖ

By Pratap

హైదరాబాద్: భారత స్టార్ క్రీడాకారిణి జ్వాలా గుత్తాకు క్రమశిక్షణంటూ లేదని ఆమె సోదరి ఇన్సి జ్వాలా వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆమె స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు బహిరంగంగా లేఖ రాసింది. తన సోదరికి క్రమశిక్షణ లేదని ఇన్సి జ్వాలా ఆ లేఖలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరక్టర్ శ్రీనివాసన్‌కు రాసిన లేఖలో చెప్పింది. ఆమె తన సోదరి పట్ల గర్వంగా ఫీలవుతూనే ఆ లేఖ రాసింది.

"చిన్నప్పుడు నేను నిద్రలేచే లోపు ఇంట్లో ఉండదు. సూర్యోదయానికి ముందు ఇంటి నుంచి వెళ్లిపోతుంది. నాన్న కూడా ఉండరు. వీరిద్దరూ సూర్యోదయానికి ముందు వెళ్లి.. ప్రాక్టీస్ అంటూ రాత్రయ్యాకే ఇంటికి చేరుకుంటారు. దీంతో నీరసంగా ఉండే గుత్తా జ్వాలా డిన్నర్ ముగించి శీఘ్రంగానే నిద్రపోతుంది. రోజూ 80 కిలోమీటర్లు మేర ప్రయాణం చేస్తారు. ప్రతీరోజూ ఇదే తంతు. నా వద్ద కూడా మాట్లాడేందుకు కూడా సమయం ఉండదు" అని ఆమె తన లేఖలో రాసింది.

My sister is indisciplined: An open letter from Jwala Gutta's sister

"నా తల్లిదండ్రులు ఎప్పుడూ అక్కతోనే ఉంటారు. నా తల్లిదండ్రులు ఆమెతోనే ఆలా ఎందుకు ఉండేవారో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. బ్యాడ్మింటన్ మాత్రమే జ్వాలాకు తిండి, నిద్ర, శ్వాస, బ్యాడ్మింటనే కలగా ఉండేది. 1996వ సంవత్సరం గుత్తా జాతీయ ఛాంపియన్‌గా నిలవడంతో నా తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. బ్యాడ్మింటన్‌కు మా కుటుంబానికి మంచి బంధం ఉండేది. గెలుపోటములు గుత్తా సహజం. ఓడినా నమ్మకాన్ని కోల్పోదు. రోజూ తన పనిని తాను చేసుకుంటూ పోతుంది. ఒక్క రోజూ కూడా ప్రాక్టీస్‌కు దూరం కాదు. ఇలా ప్రతిరోజూ బ్యాడ్మింటన్ కోసం కృషి చేసిన గుత్తా క్రమశిక్షణ లేనిదైతే అది నిజమే" అని వివరించింది.

"2006లో కామన్‌వెల్త్ క్రీడల పతకంతో అక్క ఇంటికి వచ్చింది. ఆ పతకం దేశానికి మొదటిసారి వచ్చింది. అది అందరికీ, ముఖ్యంగా మా కుటుంబానికి ఎంతో గర్వకారణం. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. మిక్స్‌డ్, వుమెన్ డబుల్స్‌ల్లో జాతీయ చాంఫియన్‌గా నిలిచినప్పటికీ ఆ ఏడాది నా సోదరిని భారత జట్టు నుంచి నెట్టేశారు. వరుసగా ఆమె ఐదోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచింది" అని చెప్పింది.

My sister is indisciplined: An open letter from Jwala Gutta's sister

వరుసగా జ్వాలా గుత్తా సాధించిన టైటిల్స్ గురించి తన లేఖలో ఇన్సి గుత్తా వివరించింది. అన్ని సాధించడానికి తన సోదరి, తన తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారని ఆమె చెప్పింది. తన సోదరి అవన్నీ సాధించినప్పటికీ, ప్రపంచ చిత్రపటంపై బ్యాడ్మింటన్‌ను నిలిపినప్పటికీ ఆమెకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులోనూ, బయట ఆమె నిరంతరం పోరాటం చేస్తూనే ఉందని ఇన్సి గుత్తా చెప్పింది.

భారత బ్యాడ్మింటన్ శాఖకు అనేక ట్రోఫీలు సాధించిపెట్టిన జ్వాలా గుత్తాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అగౌరవపరచడం, బహిష్కరించడం సహించనని అంటూ ఇన్సి జ్వాలా సుదీర్ఘమైన లేఖ రాసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+