Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స‌రికొత్త ఇండియాకు నేను ప్ర‌తినిధిని: చాపెల్‌కు కోహ్లీ కౌంటర్

My personality is a representation of new India: Virat Kohli counter to Greg Chappell

అడిలైడ్‌: ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌కు నోటి దురుసు ఎక్కువ అన్న విషయం తెలిసిందే‌. మైదానం‌లో క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలోనూ ప్ర‌త్యర్థి ఆటగాళ్ల‌ను సూటిపోటి మాట‌ల‌తో వారి ఏకాగ్రతను చెదరగొట్టడం వారికి అల‌వాటు. టీమిండియా మాజీ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్‌కు ఈ నోటి దురుసు మ‌రికాస్త ఎక్కువ‌. అందుకే ఈ మ‌ధ్య టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీని ప్ర‌శంసిస్తూనే.. అత‌ని మైండ్‌సెట్ ఓ ఆస్ట్రేలియ‌న్‌లాగా ఉంటుందని పేర్కొన్నాడు. ద మోస్ట్ ఆస్ట్రేలియ‌న్, నాన్-ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ ఆఫ్ ఆల్ టైమ్ అని విరాట్ గురించి చాపెల్ వ్యాఖ్యానించాడు. మైదానంలో కోహ్లీ దూకుడైన ఆట‌తీరు, పోరాట ప‌టిమ చూస్తుంటే.. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ మైండ్‌సెట్‌లాగే ఉంటుందన్నాడు.

గ్రెగ్ చాపెల్‌ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ కూడా ఘాటుగానే స్పందించాడు. స‌రికొత్త ఇండియాకు త‌ను ప్ర‌తినిధిని అని, తానెప్పుడూ త‌నలాగే ఉన్నాన‌ని కోహ్లీ కౌంటర్ ఇచ్చాడు. తొలి టెస్ట్‌కు ముందు జ‌రిగిన వ‌ర్చువ‌ల్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు విరాట్ ఇలా స్పందించాడు. 'నా వ్య‌క్తిత్వం, ప‌ర్స‌నాలిటీ ఓ స‌రికొత్త ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ని నేను భావిస్తాను. ఆస్ట్రేలియ‌న్ మైండ్‌ సెట్‌తో పోల్చాల్సిన అవ‌స‌రం లేదు. నా వ్య‌క్తిత్వం తొలి రోజు నుంచీ ఇలాగే ఉంది' అని విరాట్ కోహ్లీ అన్నాడు.

ఎలాంటి స‌వాళ్ల‌కైనా ఎదురు నిలిచే స‌త్తా ఈ స‌రికొత్త ఇండియాకు ఉన్న‌ద‌ని కూడా విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో చెప్పాడు. ఆశావాదం, సానుకూల భావ‌న‌ల‌తో నిండిన ఈ స‌రికొత్త ఇండియా ఎలాంటి స‌వాళ్ల‌నైనా స్వీక‌రించ‌డానికి సిద్ధంగా ఉన్న‌ద‌ని కోహ్లీ స్ప‌ష్టం చేశాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఇరు జట్ల మధ్య అడిలైడ్ వేదికగా డే/నైట్ టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ మీద భారత్‌కు రానున్నాడు. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండేందుకు విరాట్ ఫస్ట్ టెస్ట్ ముగిసిన వెంటనే స్వదేశం రానున్నాడు.

ఇటీవల గ్రెగ్‌ చాపెల్‌ మాట్లాడుతూ... 'గతంలో భారత జట్టు గాంధేయ సూత్రాన్ని పాటించేది. అవసరం లేకపోయినా ప్రత్యర్థి జట్లతో గౌరవపూర్వకంగా ఆడేవి. ఈ దృక్పథాన్ని మార్చిన మొట్టమొదటి కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ. అయితే ఈ సూత్రం భారత్‌లో పని చేసింది కానీ విదేశాల్లో ఫలితాల్ని ఇవ్వలేదు. విరాట్‌ కోహ్లీ పూర్తిగా భిన్నం. దూకుడుకు ప్రతినిధి. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చలాయించాలన్నది అతడి ఆలోచన. క్రికెట్‌ చరిత్రలోనే కోహ్లీ అత్యుత్తమ ఆస్ట్రేలియన్‌ కాని ఆస్ట్రేలియన్‌ ఆటగాడు. సరికొత్త టీమిండియాకు ఉదాహరణ. అత్యంత విలువైన ఆటగాడిగా.. క్రికెట్లో శక్తిమంతమైన జట్టుకు సారథిగా ఆట ఆదరణ కోసం బాధ్యతగా కృషి చేస్తున్నాడు' అని అన్నాడు.

Story first published: Wednesday, December 16, 2020, 17:16 [IST]
Other articles published on Dec 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+