For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పుడే ఏమైపోయింది.. నేనింకా చాలా చేయగలను: పూజారా

My limited-overs career not over yet: Cheteshwar Pujara

హైదరాబాద్: టీమిండియా టెస్టు క్రికెటర్ ఛతేశ్వర పూజారా పరిమితి ఓవర్లలో ఆడేందుకు ఇంకా తహతహలాడుతూనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం టెస్టు ఫార్మాట్‌లకే పరిమితమైన పూజారా వన్డే, టీ20లకు సైతం సిద్ధంగా ఉన్నానంటూ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో పోటీ తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో పుజారాకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థానం ప్రశ్నార్థకంగానే ఉంది.

ఇప్పటివరకూ తన కెరీర్‌లో 5వన్డేలు మాత్రమే ఆడిన పుజారా.. ఇంకా ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు కూడా ఎంపిక కాలేదు. కాగా, తన పరిమిత ఓవర్ల కెరీర్‌పై పుజారా ఆశలు మాత్రం​ వదులుకోలేదు. ఇంకా తన పరిమిత ఓవర్ల క్రికెట్‌ ముగిసిపోలేదని, దాని కోసం శ్రమిస్తూనే ఉన్నానని తాజాగా పేర్కొన్నాడు. ఏదొక రోజు ఆ ఫార్మాట్‌ క్రికెట్‌లో తన సత్తా చాటుకుంటాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ ఆడిన పుజారా.. వన్డే మ్యాచ్‌ ఆడి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. 2014లో పుజారా చివరిసారి వన్డే మ్యాచ్‌ ఆడాడు. మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఎప్పుడెప్పుడు ఆడతానే అనే ఉత్సాహంతో సెలక్టర్ల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఇలా మాట్లాడాడు.

'నేను ఇక్కడ ఒక్కటి మాత్రం చెప్పగలను. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 88 మ్యాచ్‌లకు 58కిపైగా యావరేజ్‌ సాధించా. అదే సమయంలో దేశవాళీ టీ20ల్లో 58 గేమ్‌ల్లో 105.18 స్టైక్‌రేట్‌ కూడా నమోదు చేశాను. ఇంకా పొట్టి ఫార్మాట్‌లో ఓవర్ల అవకాశం కూడా దక్కుతుందని బలంగా నమ్ముతున్నా. నేను వన్డేలకు టీ20లకు కూడా నేను కచ్చితంగా సరిపోతాను' అని పుజారా తెలిపాడు.

Story first published: Friday, February 23, 2018, 14:57 [IST]
Other articles published on Feb 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+