Yuzvendra Chahal-RJ Mahvash: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకుల తర్వాత ఆర్జే మహ్వాష్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‍లో యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్ మొదానంలో సందడి చేయడంతో ప్రేమలో ఉన్నారని అప్పటి నుంచి రూమర్లు వచ్చాయి. అనంతరం వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఆర్జే మహ్వాష్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె తన డ్రీమ్ బాయ్, ప్రేమ గురించి మాట్లాడింది.
నా జీవితం అతని చుట్టే తిరుగుతుంది..
ఆర్జే మహ్వాష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. "నా జీవితంలోకి ఏ అబ్బాయి అయితే వస్తాడో.. అతనే ఏకైక వ్యక్తి అవుతాడు. అతనే నా ప్రాణ స్నేహితుడు, ప్రియుడు అవుతాడు. అతనే నా భర్త. నా జీవితం అతని చుట్టూ తిరుగుతుంది. నాకు అవసరం లేని వ్యక్తులు వద్దు. ఆ సమయంలో మిగతా అబ్బాయిలతో నేను మాట్లాడలేను. నాకు నా భర్త చాలు" అని ఆర్జే మహ్వాష్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చెప్పుకొచ్చింది.

వీడియోను లైక్ చేసిన యుజ్వేంద్ర చాహల్
ఆర్జే మహ్వాష్ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను పంచుకుంటూ.. "ఒకే ఒక్కరు ఉంటారు" అని క్యాప్షన్ రాసింది. ఆర్జే మహ్వాష్ పోస్ట్ ను యుజ్వేంద్ర చాహల్ లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. 'మీ పోస్ట్ కు అత్యధిక లైకులు వచ్చాయనడానికి చరిత్ర సాక్ష్యం" అని ఓ అభిమాని స్పందించారు. "ప్రతీది తాత్కాలికమే.. చాహల్ ఇచ్చిన లైక్ శాశ్వతం " అంటూ మరొకరు రాసుకొచ్చారు. 'కాబట్టి చాహల్ భాయ్ ఈ సంబంధాన్ని ధృవీకరించాలని భావించాలా?' అని ఒకరు రాశారు.