For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏం జరిగింది?: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్‌ను బ్లాక్ చేసిన సంజయ్ మంజ్రేకర్

ICC Cricket World Cup 2019: Sanjay Manjrekar Holds Up Michael Vaughan On Twitter
My Life Is Now Sorted: Michael Vaughan Tweets After Being Blocked By Sanjay Manjrekar

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ భారత జట్టులోని ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్‌ను సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

రవీంద్ర జడేజా వంటి బిట్స్‌ అండ్‌ పీసెస్‌ ఆటగాళ్లకు తాను అభిమానిని కాదని, అసలు తన దృష్టిలో అతడు ఆల్‌రౌండరే కాదంటూ సంజయ్‌ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక మ్యాచ్‌లో మెండీస్‌ వికెట్‌ పడగొట్టినపుడు కూడా "జడేజా స్మార్ట్‌ గల్లీ క్రికెటర్‌" అని వ్యాఖ్యానించాడు.

దీనిపై జడేజా సైతం మంజ్రేకర్‌పై కాస్తంత ఘాటుగానే స్పందించాడు. నీ చెత్త వాగుడు ఆపితే బాగుంటుంది అంటూ జడేజా హితవు పలికాడు. భారత అభిమానులతో పాటు మంజ్రేకర్‌పై ఇతర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు సైతం ట్విట్టర్‌లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా మంగళవారం భారత్-కివీస్ మ్యాచ్‌ సందర్భంగా మంజ్రేకర్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ట్విట్టర్‌లో స్పందించాడు.

జడేజాపై మంజ్రేకర్ చేసిన కామెంట్స్ పట్ల గతంలోనే రియాక్ట్ అయిన మైకేల్ వాన్ మరోసారి భారత్-కివీస్ తొలి సెమీఫైనల్ మ్యాచ్ సందర్బంగా మంజ్రేకర్ జడేజాను పొగడటాన్ని ఉద్దేశించి యూటర్న్ తీసుకున్నాడు. దీంతో మంజ్రేకర్‌ను మరోసారి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో మైకేల్ వాన్‌ను ట్విట్టర్లో మంజ్రేకర్ బ్లాక్ చేశాడు.

దీనిని గమనించిన మైకేల్ వాన్ బ్రేకింగ్ న్యూస్.. మంజ్రేకర్ నన్ను బ్లాక చేశాడంటూ ట్విట్టర్‌లో ట్వీటే చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.

Story first published: Wednesday, July 10, 2019, 12:22 [IST]
Other articles published on Jul 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+