Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘దురదింకా తగ్గలేదు’: సచిన్ స్నేహితుడు కాంబ్లీ

ముంబై: తన చేతులకు క్రికెట్ ఆడాలనే దురద ఇంకా తగ్గలేదని చెబుతున్నాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు అనిల్ కాంబ్లీ. వివాదాస్పద ప్రవర్తనతో పాతికేళ్లు నిండకముందే క్రికెట్‌కు దూరమైన ఎడమచేతివాటం కాంబ్లీకి ఇప్పుడు 44ఏళ్లు.

అయితే, ఇప్పుడు తనకు బ్యాట్ పట్టాలని, కసితీరా షాట్లు కొట్టాలని ఇంకా దురదగా ఉందని చెప్పుకుంటున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌కు కొడుకుతోపాటు వీక్షించిన కాంబ్లీ.. మ్యాచ్ అనంతరం 'ఇంకా ఆడాలని చేతులు దురదపెడుతున్నాయి' అంటూ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

తనలాంటి ఎడమచేతి వాటం ఆటగాడైన గౌతం గంభీర్ డ్రైవ్ షాట్లు కొట్టడాన్ని ఆనందించానని, దిలీప్ వెంగ్ సర్కార్‌తో కాసేపు ముచ్చటించానని కాంబ్లీ చెప్పుకొచ్చాడు.

'నీ టైమ్‌లో నువ్వు కూడా ఆటను ఇలాగే ఎంజాయ్ చేసేవాడివి కదా' అని దిలీప్ సార్ తనతో అన్నట్లు పేర్కొన్నాడు. 90వ దశకం ప్రారంభంలో భారత జట్టులోకి వచ్చిన కాంబ్లీ తాను ఆడిన మొదటి ఏడు టెస్ట్ మ్యాచ్ లలోనే నాలుగు సెంచరీలు (వాటిలో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి) సాధించాడు.

104 వన్డేలు ఆడి రెండు సెంచరీలు, 14 అర్ధసెంచరీలు చేశాడు. ఒక్క టీ20 మ్యాచ్ ఆడకుండానే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రతిభ ఉన్నప్పటికీ వివాదాస్సద ప్రవర్తనతో అనేక చిక్కులు ఎదుర్కొన్నాడు. 2011లో అధికారికంగా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతేగాక, చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్‌పై తీవ్ర ఆరోపణలు చేసి అతని స్నేహానికి కూడా దూరమయ్యాడు కాంబ్లీ.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+